Home జాతీయ వార్తలు మోడీకి దారివ్వం: పాక్

మోడీకి దారివ్వం: పాక్

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణించే విమానానికి తమ దేశ గగనతల మార్గాన్ని ఇవ్వబోమని పాకిస్థాన్ తేల్చి చెప్పింది. బుధవారం పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధాని మోడీ అమెరికా పర్యటన కోసం పాకిస్థాన్ గగనతలాన్ని వినియోగించుకునేందుకు అనుమతించాలంటూ భారత్ చేసిన విజ్ఞప్తిని  అంగీకరించబోమని మహ్మద్ ఖురేషీ తెలిపారు. ఈ సమాచారాన్ని భారత హై కమిషన్‌కు కూడా చేరవేసినట్లు తెలిపారు. కాగా, ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విదేశీ పర్యటన సందర్భంగా కూడా పాక్‌ అనుమతి ఇవ్వలేదు.

భారత ప్రభుత్వం.. జమ్మూకశ్మీర్‌క విభజన, ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని పాక్ వ్యతిరేకించింది. దీంతో ఇరుదేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో పాక్ గ‌గ‌న‌త‌లంపై ఆంక్ష‌లు విధించింది. అయితే, ఈ నెల 20న ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉండడంతో.. మోడీ విమానం ప్ర‌యాణించేందుకు భారత్, పాక్ ప‌ర్మిష‌న్ కోరింది. కానీ, పాక్ మోడీ విమానాన్ని అనుమతించేదిలేదని స్పష్టం చేసింది.

PM Modi’s plane not allowed in Pak airspace: Qureshi