Home జాతీయ వార్తలు కరోనాను తుదముట్టించేవరకు పోరాటం : ప్రధాని నరేంద్ర మోడీ

కరోనాను తుదముట్టించేవరకు పోరాటం : ప్రధాని నరేంద్ర మోడీ

PM Narendra Modi Addressed India Peopleన్యూఢిల్లీ : దేశంలో కరోనాను తుదముట్టించేవరకు పోరాటం ఆగదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అక్టోబ‌ర్ 21వ తేదీతో దేశంలో  వంద కోట్ల మందికి టీకాలు వేసి చరిత్ర సృష్టించామని ఆయన పేర్కొన్నారు. ప్రజల సహకారంతోనే టీకా కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతుందని ఆయన చెప్పారు. వంద కోట్ల టీకాలు అంకెలు మాత్రమే కాదని, భారత చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయమని ఆయన తెలిపారు. కరోనా కఠిన పరిస్థితుల్లో భారత్ ఓ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుందని ఆయన స్పష్టం చేశారు. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు భారత్ కఠినంగా పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు. వంద కోట్ల టీకాల విషయంలో విఐపి సంస్కృతి చోటు చేసుకోలేదని ఆయన చెప్పారు. టీకాలపై మొదట్లో భయాందోళనలు ఉండేవని, అతిపెద్ద దేశమైన భారత్ లో టీకా కార్యక్రమం విజయవంతం కాదని కొందరు విమర్శించారని, అయితే, వారి విమర్శలను తిప్పికొడుతూ టీకాల విషయంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నామని ఆయన తేల్చిచెప్పారు. టీకాల విషయంలో ప్రతిఒక్కరిని సమానంగా చూశామని ఆయన పేర్కొన్నారు. దేశంలో నిర్వహిస్తున్న టీకా ప్రక్రియ పట్ల ప్రతిఒక్కరు గర్వంగా భావించాలని ఆయన చెప్పారు. శాస్త్రీయ ప‌ద్ధ‌తిలో, శాస్త్రీయ ఆధారంగా టీకా ప్రక్రియ నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కరోనా క్రమేపి తగ్గుముఖం పడుతున్నప్పటికీ, ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకుండా, మహమ్మారి బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.