Home జాతీయ వార్తలు మహాబలిపురం చేరుకున్న మోడీ

మహాబలిపురం చేరుకున్న మోడీ

PM Narendra Modiచెన్నయ్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ మహాబలిపురం చేరుకున్నారు. మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు మోడీ భేటీ అవుతారు. ఈ క్రమంలోనే మోడీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నయ్ వచ్చారు. అక్కడ ఆయనకు తమిళనాడు ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఇదిలా ఉండగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమిళనాడు పర్యటనను నిరసిస్తూ చెన్నయ్ విమానాశ్రయంలో ఐదుగురు టిబెటియన్ లు ఆందోళనకు దిగడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. జిన్ పింగ్ బస చేసే ఐటిసి గ్రాండ్ హోటల్ వద్ద ఆందోళనకు దిగిన ఎనిమిది మంది టిబెటియన్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

PM Narendra Modi Came To Mahabalipuram