Home Default ఇది ప్రజల విజయం : మోడీ

ఇది ప్రజల విజయం : మోడీ

PM Modiన్యూఢిల్లీ : అయోధ్య భూ వివాదంపై శనివారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు అన్ని వర్గాల ప్రజల విజయమని ఆయన పేర్కొన్నారు. ఈ తీర్పును గెలుపోటముల కోణంలో చూడొద్దని ఆయన దేశ ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. భారత భక్తిభావాన్ని మరింత బలోపేతం చేయాల్సిన సమయం ఇదని ఆయన తెలిపారు. దేశ ప్రజలు శాంతిసహనంతో ముందుకుసాగి దేశ ఐక్యతను చాటి చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. ఓ వివాదస్పదమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు న్యాయ ప్రక్రియ చాలా అవసరమని ఆయన వెల్లడించారు. అయోధ్య కేసులో సుప్రీం తీర్పుతో ఈ విషయం రుజువైందని ఆయన చెప్పారు. భారత్ లౌకిక దేశమని, భిన్నత్వంలో ఏకత్వంతో ముందుకు సాగాలని ఆయన దేశ ప్రజలను ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో మెలిగినప్పుడే దేశంలో శాంతి ఫరిడవిల్లుతుందని ఆయన వెల్లడించారు. దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.

PM Narendra Modi comments on Ayodhya land dispute