Home Default కాంగ్రెస్ ఎంపిల నిజ స్వరూపాలను బయటపెట్టండి : మోడీ

కాంగ్రెస్ ఎంపిల నిజ స్వరూపాలను బయటపెట్టండి : మోడీ

PM Narendra Modi Comments On Congress MPsన్యూఢిల్లీ : ప్రజా సమస్యలపై చర్చించనీయకుండా పార్లమెంట్ సమావేశాలను కాంగ్రెస్ ఎంపిలు అడ్డుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటున్న కాంగ్రెస్ ఎంపిల నిజ స్వరూపాలను బయపెట్టాలని మోడీ బిజెపి ఎంపిలకు సూచించారు. మంగళవారం బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మోడీ పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపిల తీరుపై ధ్వజమెత్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి విపక్ష సభ్యలు సమావేశాలను అడ్డుకుంటూ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్ సహా విపక్ష సభ్యుల తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని ఆయన బిజెపి ఎంపిలను కోరారు.