Home జాతీయ వార్తలు ఈ-గ్రామ స్వరాజ్‌ పోర్టల్‌, మొబైల్‌ యాప్ ప్రారంభించిన ప్రధాని మోడీ

ఈ-గ్రామ స్వరాజ్‌ పోర్టల్‌, మొబైల్‌ యాప్ ప్రారంభించిన ప్రధాని మోడీ

PM-Modi

న్యూఢిల్లీ: పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్న సర్పంచులతో ప్రధాని మోడీ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు ప్రధానితో తమ అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకున్నారు. పంచాయతీరాజ్ సందర్భంగా ప్రధాని ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్, మొబైల్ యాప్ ను ప్రారంభించారు. ప్రధాని మాట్లాడుతూ… ”పంచాయతీరాజ్ వ్యవస్థ బలంగా ఉంటేనే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. ప్రస్తుతం లక్షా 25 వేల పంచాయతీల్లో బ్రాండ్ బ్యాండ్ సేవలు అందుతున్నాయి. ఈ-గ్రామస్వారజ్ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా ఎన్నో సేవలు పొందవచ్చు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మరింత మెరుగు పరుచుకోవాలి.

ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్ వల్ల బ్యాంకు రుణాలు తీసుకోవడం కూడా సులభం. గ్రామాల్లో ఆస్తులు గుర్తించేందుకు డ్రోన్లు ఉపయోగించాలి. ఏటా మెరుగైన పనితీరు కనబరిచిన గ్రామ పంచాయతీలకు పురస్కారులు ఇవ్వాలి. పురస్కరాలు గెలుచుకున్న గ్రామపంచాయతీలకు శుభాకాంక్షలు. గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు పంచాయతీరాజ్ శాఖ ఎంతో కృషి చేస్తోంది. కరోనా మహమ్మారి మనకు గొప్ప గుణపాఠం నేర్పింది. కష్ట సమయంలో ఆత్మస్థైర్యంతో ఉండాల్సిన అవసరం ఉంది. కరోనాపై గ్రామ ప్రజలకు మరింత అవగాహన, చైత్యన్యం కలిగించాలి” అని ప్రధాని పేర్కొన్నారు.

PM Narendra Modi interacts with Sarpanchs