Home తాజా వార్తలు శివాజీ స్మారక స్థూపం నిర్మాణానికి ప్రధాని మోడీ జలపూజ

శివాజీ స్మారక స్థూపం నిర్మాణానికి ప్రధాని మోడీ జలపూజ

PM-Modi-Jala-Pooja

ముంబయి: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ స్మారక స్థూపం నిర్మాణం కోసం శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జలపూజ నిర్వహించారు. ప్రత్యేక ఓడలో ప్రధాని అరేబియా సముద్రంలో కొంత దూరం వరకు వెళ్లి అక్కడ పూజలు చేశారు. సుమారు రూ. 3600 కోట్ల వ్యయంతో ఈ స్మారక కేంద్రాన్ని నిర్మిస్తున్నారు.

రాజ్ భవన్‌కు సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో సముద్రంలోని భారీ రాయిపై 192 మీటర్ల ఎత్తు ఉన్న శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మెమొరియల్‌కు శివ స్మారక్‌గా నామరణం చేయనున్నారని సమాచారం. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్మారక స్థూపంగా నిలుస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. జలపూజలో శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కూడా పాల్గొన్నారు.