Home జాతీయ వార్తలు రాష్ట్రపతితో ప్రధాని మోడీ భేటీ

రాష్ట్రపతితో ప్రధాని మోడీ భేటీ

PM Narendra Modi Meets President Ram Nath Kovindఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో ఆదివారం భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన మోడీ రాష్ట్రపతితో సుమారు గంట సేపు వివిధ అంశాలపై చర్చించారు. భారత్, చైనా వివాదం, దేశంలో కరోనా పరిస్థితిపై మోడీ కోవింద్ కు వివరించారు. భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న వివాదం కారణంగా గత నెల 15న జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలో గత శుక్రవారం మోడీ లడక్ లోని సరిహద్దు ప్రాంతానికి వెళ్లి సైనికులతో మాట్లాడారు. చైనాకు చెందిన 59 యాప్ లను భారత్ లో నిషేధించినట్టు మోడీ రాష్ట్రపతికి వివరించారు. దేశంలో కరోనా లాక్ డౌన్ విధించిన తరువాత రాష్ట్రపతి కోవింద్ ను ప్రధాని మోడీ కలవడం ఇదే తొలిసారి. భేటీ సందర్భంగా వీరిద్దరు మాస్క్ లు ధరించారు.  ఇదిలా ఉండగా దేశంలో కరోనా కేసుల సంఖ్య ఆరు లక్షలు దాటింది.