Friday, April 19, 2024

కరోనా నుంచి దేశాన్ని కాపాడడమే నా లక్ష్యం: మోడీ

- Advertisement -
- Advertisement -

 Corona virus

 

ఢిల్లీ: కరోనా వైరస్ నుంచి దేశ ప్రజలను కాపాడడమే తన లక్ష్యమని ప్రధాని మోడీ తెలిపారు. బిజెపి 40వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సందేశం ఇచ్చారు. కరోనా కట్టడికి కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని, లాక్‌డౌన్ సమయంలో ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు. కరోనా కట్టడికి భారత్ తీసుకుంటున్న చర్యలను డబ్ల్యుహెచ్‌ఒ ప్రశంసించిందన్నారు. ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు లైట్లు ఆపి దేశ ప్రజలంతా దీపాలు వెలిగించారని, దేశవ్యాప్తంగా దీపాలు వెలిగించి మన ఐక్యతను చాటారన్నారు. కరోనాపై పోరులో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని, సంక్షోభ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం బాగుందని మోడీ కొనియాడారు. భారత్ దేశంలో కరోనా వైరస్ 4362 మందికి సోకగా 121 మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా వ్యాధి 334 మందికి సోకగా 11 మంది చనిపోయారు. ప్రపంచంలో కరోనా రోగుల సంఖ్య 12,75,037కు చేరుకోగా 69,501 మంది మృత్యువాతపడ్డారు.

 

PM Narendra modi protect India from Corona virus,India’s battle against COVID-19 sets distinct example for the world,Our mothers & sisters gave their jewellery during wars in the past

 

PM Narendra modi protect India from Corona virus
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News