Home జాతీయ వార్తలు దేశ ప్రజలకు మోడీ రాఖీ శుభాకాంక్షలు

దేశ ప్రజలకు మోడీ రాఖీ శుభాకాంక్షలు

PM Narendra Modi Raksha Bandhan Wishes To Peopleన్యూ ఢిల్లీ : దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రక్షా బంధన్ (రాఖీ) పండుగను దేశ ప్రజలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మోడీ ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సోదరసోదరీమణుల అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పండుగ సోదర, సోదరీమణులను కట్టిపడేసి, బలమైన అనుబందాలను పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా దేశ ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ఈ పండుగ ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.