Saturday, April 20, 2024

దేశ చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

PM Narendra modi Ram Mandir Speech LIVE Updates

లక్నో: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమిపూజ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా వేదపండితుల వేద మంత్రోచ్చారణల మధ్య భూమిపూజ కన్నులపండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్, యుపి గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రామ మందిరం ట్రస్ట్ ఛైర్మన్ నృత్యగోపాల్ దాస్ మహరాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూమి పూజతో ప్రపంచంలో ఉన్న కోట్లాది హిందువుల చిరకాల కోరిక నెరవేరింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సాధువులు హాజరయ్యారు. ఈ పూజలో నక్షత్రాకారంలో ఉన్న ఐదు వెండి ఇటుకలను ఉంచారు. ఈ వెండి ఇటుకలు 5 విగ్రహాలకు ప్రాతినిధ్యం వహిస్తాయని పండితులు చెప్పారు. మరోవైపు భూమిపూజ జరుగుతున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధాని ప్రధాని మాట్లాడుతూ… అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ చేయడం తన మహద్భాగ్యమన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశమంతా రామమయమైందని పేర్కొన్నారు. ఈ నాటి జయజయధ్వానాలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. దేశ చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయం అన్న ప్రధాని దేశం మొత్తం ఆధ్యాత్మిక భావనలో నిండిపోయిందన్నారు. విశ్వవ్యాప్తంగా జైశ్రీరామ్ నినాదాలు మార్మోగుతున్నాయి. రాముడు అందరి మనసుల్లో నిండి ఉన్నాడు. ఎందరి త్యాగ ఫలితమో నేడు సాకారమైంది” అని మోడీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News