Thursday, April 25, 2024

కోలుకుంటున్నాం

- Advertisement -
- Advertisement -

PM Narendra Modi Says We Are Recovering

ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతోంది
ఖరీఫ్ సాగు ఆశాజనకం
21 రాష్ట్రాల సిఎంలతో ప్రధాని సమీక్ష
వైరస్‌పై పోరులో నిర్లక్షం వద్దు
నేడు 15 రాష్ట్రాల సిఎంలతో రివ్యూ

నేడు తెలంగాణ, ఎపి సిఎంలతో సంభాషణ

అన్‌లాక్ 1 నేపథ్యంలో బుధవారం ప్రధాని మిగిలిన రాష్ట్రాల సిఎంలతో సమీక్షిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, కర్నాటక, గుజరాత్, బీహార్, యుపి వంటి 15 రాష్ట్రాల సిఎంలు, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌తో మాట్లాడుతారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ రాష్ట్రాలతో పిఎం సమీక్షలో ఎటువంటి తుది నిర్ణయం ఉంటుందనేది కీలకంగా మారింది.

న్యూఢిలీ: ప్రస్తుత లాక్‌డౌన్ సడలింపుల దశతో దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి క్రమేపీ పుంజుకొంటోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అన్‌లాక్ 1 నేపథ్యం లో సోమవారం ఆయన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. క్రమేపీ సడలింపులు వెలువడ్డ దశలో రాష్ట్రాలలో పరిస్థితి ఏమిటీ? ఎటువంటి సమస్యలు త లెత్తుతున్నాయి? ప్రత్యేకించి కోవిడ్ 19 వైరస్ ఆటకట్టుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారనే అంశాలపై ప్రధాని ప్ర త్యేకంగా వారితో సమీక్షించారు. ఆర్థిక పునరుద్ధరణ సంకేతాలు వెలువడుతున్నాయని, ఇది మంచి సంకేతం అని ప్రధాని తెలిపారు. అయితే వైరస్ వ్యాప్తి చెందడం తీవ్ర పరిణామం అవుతున్నందున దీని కట్టడికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సూచనలు సలహాలు తెలియపర్చాలని ప్రధాని ఈ సం దర్భంగా సిఎంలను కోరారు.

కరోనా మహమ్మారి పలు సవాళ్లను తెచ్చిపెట్టింది. ఇదే సమయంలో దేశంలోని సహకార సమాఖ్య విధానం, రాష్ట్రాలు , కేం ద్రం మధ్య సమన్వయం సరిగ్గా ప్రతిఫలించిందని, కరోనా తీవ్రతను అరికట్టేందుకు కేంద్రం రాష్ట్రాలు సరిగ్గా సమన్వయంగా పనిచేస్తున్నాయని, ఈ దశలో వివిధ రాష్ట్రాలకు ప్రధాని కితాబు ఇచ్చారు. సిఎంల అభిప్రాయాలను సేకరించే ముందు ఆయన కొద్ది సేపు మాట్లాడారు. 21 రాష్ట్రాల సిఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ఈ వీడియో భేటీ దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ తదుపరి ఘట్టంపై ఆసక్తిని రేకెత్తించింది.

తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కేసులు పెరుగుతూ ఉన్నందున లాక్‌డౌన్‌ను కట్టుదిట్టం చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. దీనితో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను తిరిగి పూర్తిస్థాయిలో విధిస్తారని, దీనితో అంతరాష్ట్ర రవాణా వ్యవస్థ తిరిగి నిలిచిపోతుందనే భయాలు నెలకొన్నాయి. వైరస్ ఓ హంతకిగా మారిందని, ఇది కిల్లర్ వైరస్ అని, దీనినుంచి రక్షించుకునే ప్రక్రియలో ప్రజలు ఎటువంటి అలసత్వానికి తావు ఇవ్వరాదని ప్రధాని సూచించారు. కోవిడ్ 19పై పోరులో మనం సాధిస్తున్న విజయం ముందు మన నిర్లక్షాలు కనబడకుండా పోతాయని, అయితే ఉదాసీతన పనికిరాదని ప్రధాని తెలిపారు. అన్‌లాక్ 1 రెండు వారాల దశను పూర్తి చేసుకుందని, ఈ దశలో పరిస్థితిని సమీక్షించుకోవల్సి ఉంటుందన్నారు.

సకాలంలో స్పందించడం కీలకం

ఏ సంక్షోభం అయినా తగు సమయంలో స్పందించడం అవసరం అని, దేశంలో కరోనా సంక్షోభ నివారణకు సకాలంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతగానో ఉపకరించాయని తెలిపారు. సముచిత నిర్ణయం సకాలంలో తీసుకుంటే అది సక్రమంగా అమలు అయితే మంచే జరుగుతుందని ప్రధాని తెలిపారు. పలు దేశాలలో కరోనా వైరస్ గురించి అసలు మాట్లాడుకోని దశలోనే ఇండియాలో దీనిని ఎదుర్కొనేందుకు అన్ని చర్యలూ తీసుకున్నట్లు, సముచిత నిర్ణయాలకు దిగినట్లు ప్రధాని తెలిపారు. ప్రతి భారతీయుడిని రక్షించేందుకు రాత్రింబవళ్లూ కష్టపడ్డామని తెలిపారు. గత కొన్ని వారాలలో వేలాది మంది భారతీయులు విదేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారని , గత వారం లక్షలాది మంది వలసకూలీలు వారివారి స్వగ్రామాలకు చేరారని ప్రధాని గుర్తు చేశారు.

రైలు రోడ్డు, వైమానిక, సముద్ర మార్గాలు అన్నీ తెరుచుకున్నాయని, మరింతగా రీఓపెన్ జరగాల్సి ఉందన్నారు. అత్యధిక జనాభా జనసాంద్రత ఉన్న భారత్ వంటి దేశంలో ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ సంఖ్యలో కరోనా వ్యాప్తి ఉందని, ఇతర దేశాలతో పోలిస్తే దీని ప్రభావం తక్కువే అని తేల్చిచెప్పారు. భారతదేశంలో లాక్‌డౌన్, ఈ దశలో ప్రజలు కనబర్చిన క్రమశిక్షణ, సంఘటిత శక్తి గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు ఇప్పుడు చర్చించుకుంటున్నారని ప్రధాని తెలిపారు. రికవరీల రేటు 50 శాతం దాటిందని, అయితే కరోనాతో ఏ ఒక్కరు మృతి చెందినా అది బాధాకరమే అవుతుందన్నారు.

ఆర్థిక రంగానికి పునరుజ్జీవ సంకేతాలు

గత కొద్ది రోజులుగా ఉత్పత్తి రంగంలో పలు రకాలుగా వృద్ధి కనబడుతోందని ప్రధాని చెప్పారు. లాక్‌డౌన్ దశలో విద్యుత్ వినిమయం తగ్గుతూ వచ్చిందని, అయితే పరిశ్రమలు తెరుచుకోవడంతో ఇది పెరిగిందన్నారు. మే నెలలో ఎరువుల విక్రయాలు పెరిగాయని, నిజానికి గత ఏడాది మే నెలతో పోలిస్తే ఇవి రెండింతలు అయ్యాయని, పరోక్షంగా ఇది వ్యవసాయ రంగ పనులను తెలియచేస్తోందన్నారు.

వ్యవసాయ సాగు బాగు

గతంతో పోలిస్తే ఈసారి వ్యవసాయ రంగం పుం జుకుందని, ఖరీఫ్ సాగు పెరిగిందని, పోయిన ఏడాదితో పోలిస్తే ఇది 12 లేదా 13 శాతం పెరిగిందని వివరించారు. ద్విచక్రవాహనాల ఉత్పత్తి డిమాండ్ పెరిగాయని, లాక్‌డౌన్ ముందుతో పో లిస్తే ఇది ఇప్పుడు 70%గా ఉందని తెలిపారు. డి జిటల్ చెల్లింపులు రిటైల్‌గా చూస్తే లాక్‌డౌన్ తొలి స్థాయికి చేరాయని వివరించారు. వైరస్‌పై అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి నిర్ల క్షం వహించినా, క్రమశిక్షణ లేకపోయినా పరిస్థితి తిరిగి చిక్కుల్లో పడుతుందని హెచ్చరించారు.

మాస్క్‌లు అనివార్యం అయ్యాయి

మనిషి జీవితపు అలవాట్లలో మార్పులు వచ్చాయని, మాస్క్‌లు లేకుండా బయటకు రావడం అనేది ఇప్పుడు అనూహ్యం అయిందని, ప్రతి చోటా మాస్క్‌లు తప్పనిసరి ధారణగా మారాయని తెలిపారు. అదే విధంగా భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రధాని మోడీ మంగళవారం పంజాబ్ సిఎం అమరీందర్ సింగ్, త్రిపుర సిఎం బిప్లవ్‌కుమార్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఇతరులతో మాట్లాడారు. వర్చువల్ కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News