Thursday, April 18, 2024

ఏక్ చోఖా.. కడక్ చాయ్

- Advertisement -
- Advertisement -

modi

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ బుధవారం ఇక్కడి హునార్ హాట్ మేళకు ఆకస్మికంగా వెళ్లారు. రాజ్‌పథ్‌లో హస్తకళాకారుల మేళ సాగుతుంది. తీరికలేకుండా ఉండే ప్రధాని బుధవారం కేబినెట్ భేటీ కాగానే ముందస్తు సమాచారం లేకుండా మేళకు వెళ్లారు. కొద్ది సేపు షాపులలో తిరిగారు. అక్కడి వారితో మాట్లాడారు. ఉత్తరాది వంటకం అయిన లిట్టీ చోఖా తిని, తరువాత మట్టి కప్పులో కుల్హాడ్ చాయ్ తాగారు. మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ మేళను నిర్వహిస్తోంది. ప్రధాని వచ్చినట్లు తెలియగానే అధికారులు కంగుతిన్నారు. దాదాపు గంట సేపు ఈ ప్రదర్శన స్థలిలో ప్రధాని గడిపారు. గోధుమ పిండి, సత్తుపిండితో కూడిన లిట్టి చోఖా ఉత్తరాదిలో చాలా ఇష్టంగా తింటారు.

దీనిని సేవించిన ప్రధాని రూ 120 బిల్లుగా చెల్లించారు.తరువాత టీని మైనార్టీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీతో కలిసి తాగి రెండు కప్పుల టీకి రూ 40 చెల్లించారు. ఇండియా గేట్ వద్ద ఈ హాట్‌లో తాను ఆనందగా తిరిగినట్లు , రుచికరమైన వంటకాలు, పలు చేనేత ఉత్పత్తులు అంతా మధురానుభూతిని మిగిల్చిందని , అంతా సందర్శించాలని పిలుపు నిచ్చారు. చిరుతిండ్ల స్టాల్స్‌పై ఎక్కువగా దృష్టి సారించిన ప్రధాని పనిలో పనిగా వాయిద్య పరికాల స్టాల్స్‌కు వెళ్లినప్పుడు వాటిని మీటి చూశారు. కొందరు కళాకారులతో మోడీ ముచ్చటించారు. వికలాంగ కళాకారుడు ఒకరిని కలిసి, ఆయన కళారీతిని గురించి తెలుసుకున్నారు. ప్రధాని వచ్చినట్లు తెలియగానే ఈ మేళకు జనం రాకడ ఎక్కువైంది. కొందరు మోడీతో కలిసి సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. భద్రతా బలగాలకు ఈ క్రమంలో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.

PM narendra modi tries litti chokha and kulhad chai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News