Home జాతీయ వార్తలు రామ్‌ల‌ల్లాకు ప్రధాని మోడీ సాష్టాంగ‌ న‌మ‌స్కారం

రామ్‌ల‌ల్లాకు ప్రధాని మోడీ సాష్టాంగ‌ న‌మ‌స్కారం

PM Narendra Modi Visits Ram Lalla Temple At Ayodhyaలక్నో : అయోధ్యలో కొద్దిసేపట్లో రామాలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. కాసేపటి క్రితమే మోడీ అయోధ్య చేరుకున్నారు. అయోధ్యలోని రామ్ లల్లాను మోడీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రామ్ లల్లాకు సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ఆయన రాముడికి పూజ చేశారు. రామాలయ నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా మోడీ సాంప్రదాయ వస్త్రధారణతో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిశారు. రామ్ లల్లా విగ్రహం చుట్టూ ఆయన ప్రదక్షణలు చేశారు. ఈ సందర్భంగా మోడీ ఆలయంలో పారిజాత మొక్కను నాటారు. ఈ పూజలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యుపి గవర్నర్ ఆనందీబెన్, సిఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు 17 మంది ప్రముఖులు పాల్గొన్నారు.