Thursday, April 25, 2024

బొగ్గు కొరతపై నేడు ప్రధాని సమీక్ష

- Advertisement -
- Advertisement -

PM review on coal

న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్, బొగ్గు మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ప్రధాని సమీక్ష నిర్వహించనున్నారని సమాచారం. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా బొగ్గు నిల్వలపై సోమవారం కీలక భేటీ నిర్వహించారు. బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కె సింగ్‌తో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు, విద్యుత్ సరఫరా, డిమాండ్ వంటి అంశాలపై చర్చించారు. ఇదిలావుండగా బొగ్గు నిల్వలు నాలుగు రోజులకు కూడా సరిపోయేలా లేని విద్యుత్కేంద్రాల సంఖ్య 70కి పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉన్నత స్థాయి సమీక్షలు జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News