Home అంతర్జాతీయ వార్తలు బ్రిటన్‌లో నెలంతా లాక్‌డౌన్‌కు ప్రధాని బోరిస్ యోచన

బ్రిటన్‌లో నెలంతా లాక్‌డౌన్‌కు ప్రధాని బోరిస్ యోచన

PM set to announce month long England lockdown

 

లండన్ :దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నందున దేశమంతా నెల రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేయాలన్న యోచనలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఉన్నారు. శనివారం కేబినెట్ సమావేశాల్లో ఆయన దీనిపై చర్చించారు. మరోసారి ఇంగ్లాండ్ చీఫ్‌మెడికల్ ఆఫీసర్‌తో సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటారు. కొత్త లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం అత్యవసర వ్యాపారాలు తప్ప మిగతాసంస్థలన్నీ విద్యాసంస్థలతోసహా మూసివేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం అమలౌతున్న మూడంచెల స్థానిక లాక్‌డౌన్ నిబంధనలను కూడా కఠినతరం చేయాలని యోచిస్తున్నారు.