Home జాతీయ వార్తలు మూడువేల కేంద్రాల్లో టీకా డ్రెవ్

మూడువేల కేంద్రాల్లో టీకా డ్రెవ్

PM to launch vaccination drive 3000 sites in phase 1

 

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ టీకా డ్రెవ్ ను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించనున్నట్లు ఓ నీతి ఆయోగ్ సభ్యుడ్ వీకే పాల్ వెల్లడించారు. కరోనా వైరస్ డేటా ప్రకారం… టీకా డ్రెవ్ శనివారం దేశవ్యాప్తంగా మూడు వేల సైట్లలో ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమం కొనసాగుతున్న కొద్దీ ఐదువేల సైట్ల వరకు పెంచనున్నట్లు వీకే పాల్ తెలిపారు. దేశంలోని ఆయా రాష్ట్రాలకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదించిన కరోనా వ్యాక్సిన్లు కొవిషీల్డ్‌, కొవాగ్జిన్లు ఇప్పటికే కేంద్రం తరలించింది. మొదటి విడతలో 30 కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా ఇవ్వనున్నారు. వ్యాక్సిన్‌ పంపిణీ మొదలైన తర్వాత డోసులు ఎక్కువగా పెంచనున్నట్లు తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి రాష్ట్రాలు, యూటీల్లో సన్నాహాలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.

PM to launch vaccination drive 3000 sites in phase 1