Home జాతీయ వార్తలు పిఎన్‌బి మోసం లావాదేవీలు పెరిగాయ్

పిఎన్‌బి మోసం లావాదేవీలు పెరిగాయ్

pnb-skam

అదనంగా రూ.1300 కోట్లు
మొత్తం రూ.12,700 కోట్లకు చేరిన కుంభకోణం
స్టాక్ ఎక్సేంజ్‌కు తెలియజేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్

న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్(పిఎన్‌బి) మరో షాకింగ్ వార్తను వినిపించింది. డైమండ్ వ్యాపారీ నీరవ్ రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని గతంలో ప్రకటించిన బ్యాంక్.. తాజాగా మోసం లావాదేవీలు మరింతగా పెరిగాయని ప్రకటించింది. నీరవ్ మోసం కేసులో మరో రూ.1300 కోట్లు (204.25 మిలియన్ డాలర్లు) లావాదేవీలు అక్రమంగా జరిగినట్టు గుర్తించామని బ్యాంక్ వెల్లడించింది. ఈమేరకు మంగళవారంనాడు స్టాక్ ఎక్సేంజ్‌కు సమాచారం అందించింది. దీంతో మొత్తం కుంభకోణం విలువ రూ.11,400 కోట్ల నుంచి రూ.12,700 కోట్లకు పెరిగింది. పిఎన్‌బిలో మోసానికి పాల్పడిన నీరవ్ మోడీ విదేశాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి బిఎస్‌ఇ ఫైలింగ్‌లో రూ.12,700 కోట్లకు పైగా మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది. దీంతో మంగళవారం ట్రేడింగ్‌లో పిఎన్‌బి షేర్లు కుప్పకూలాయి. సుమారు 9 శాతానికి పైగా పతనమయ్యాయి. బ్యాంక్ షేరు విలువ 52 వారాల కనిష్టానికి పడిపోయింది. అలాగే ఎన్‌ఎస్‌ఇలోనూ నష్టాలు కొనసాగాయి. ఉదయం షేరు విలువ రూ.106.80 వద్ద ప్రారంభమై 8.82శాతం పడిపోయింది.