Home తాజా వార్తలు రూ.3,688 కోట్ల డిహెచ్‌ఎఫ్‌ఎల్ రుణం మోసం

రూ.3,688 కోట్ల డిహెచ్‌ఎఫ్‌ఎల్ రుణం మోసం

PNB reporting Rs 3,688 crore DHFL loans as fraud

 

బహిర్గతం చేసిన పిఎన్‌బి

న్యూఢిల్లీ: దివాళా తీసిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డిహెచ్‌ఎఫ్‌ఎల్)కు మంజూరు చేసిన రూ.3,688 కోట్ల రుణం మోసపూరితమైందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) తెలియజేసింది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు ఇచ్చిన సమాచారంలో బ్యాంక్ ఈ విషయాన్ని తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఆర్‌బిఐ నిర్దేశించిన నిబంధనల ప్రకారం, ఇలాంటి ఖాతాను నాలుగు త్రైమాసికాల్లో రికవరీ చేయకపోతే, 100శాతం కేటాయింపు చేయవలసి ఉంటుంది.

బ్యాంక్ ఇప్పటివరకు రూ.1,246 కోట్లు కేటాయించింది. మూడేళ్ల కాలంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఇది నాలుగో మోసం కేసు కావడం గమనార్హం. డిహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రస్తుతం దివాలా ప్రక్రియలో ఉంది. రూ.3,688 కోట్ల డిహెచ్‌ఎఫ్‌ఎల్ మోసం ఆర్‌బిఐకి నివేదించినట్లు బ్యాంక్ తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), యూనియన్ బ్యాంక్ కూడా డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ను మోసం ఖాతాగా ప్రకటించాయి. ఇదే నిర్ణయం ప్రైవేట్ సెక్టా ర్ బ్యాంక్ ఇండస్‌ఇండ్ బ్యాంక్ కూడా తీసుకుంది.