Home తాజా వార్తలు అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

Pocharam Planted Plants In Assembly Premisesహైదరాబాద్ : మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పుట్టిన రోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ కార్యకర్తలు జరుపుకుంటున్నారు. కెటిఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వ‌హిస్తున్న ముక్కోటి వృక్షార్చ‌న‌ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి ప్రొటెం చైర్మ‌న్ భూపాల్ రెడ్డి తదితరులు అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో  మొక్క‌లు నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంక‌టేశ్‌, ఎమ్మెల్సీలు ఎమ్మెస్ ప్ర‌భాక‌ర్ రావు, భానుప్ర‌సాద్ రావు, కూచికుళ్ల దామోద‌ర్ రెడ్డి, వాణీదేవీ, బుగ్గారం దయానంద్, ఫారుక్ హుస్సేన్, విజీ గౌడ్, లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్ట‌ర్ వి నరసింహా చార్యులు  తదితరులు పాల్గొన్నారు.