Home తాజా వార్తలు పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా….

పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా….

Pocharam Srinivas reddy corona positive

హైదరాబాద్: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కరోనా వైరస్ సోకింది. రెగ్యులర్ మెడికల్ టెస్ట్ లలో భాగంగా బుధవారం రాత్రి చేయించిన కోవిడ్ టెస్ట్ లో తనకు పాజిటివ్ వచ్చిందని పోచారం తెలిపారు. ప్రస్తుతం తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు  గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రిలో చేరాను. గత కొన్ని రోజులుగా తనని కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్ లో ఉండగలని కోరారు.