Home నిజామాబాద్ ‘హరితహారం’పై మంత్రి సీరియస్

‘హరితహారం’పై మంత్రి సీరియస్

POCHARAMమన తెలంగాణ/కలెక్టరేట్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని అధికారులు ఆషామాషీగా తీసుకోవద్దని, సీరియస్‌గా పనిచేయాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో సోమవారం ఉదయం మండల, జిల్లాస్థాయి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి పోచారం హరితహారం నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు అంతా హరితహారం కార్యక్రమంలో నిమగ్నం కావాలని, ఈ నెల 22 వరకూ ఎవరికి సెలవులు ఉండబోవని స్పష్టం చేశారు. మన ప్రాంతంలో మబ్బులుపై నుంచి పోతున్నా వానలు పడటం లేదని దీనికి కారణం చెట్లు లేకపోవడమేనని, చెట్లున్న చోట్లనే వర్షాలు బాగా కురుస్తాయ ని. కాబట్టి జిల్లా అంతా మొక్కలను నాటాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ భవిష్యత్తును, రైతుల సంక్షేమాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు రావాలన్నారు. హరితహారం అమలుకు రెండు గ్రామ పంచాయతీలకు ఒక క్లస్టర్‌గా అధికారిని నియమించాలని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నోడల్ అధికారిని, మున్సిపాలిటీలకు కమి షనర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామ పంచాయ తీలో 40 వేల మొక్కలు నాటించాలి. గుంతలు తవ్విన తర్వా తనే నర్సరీల నుంచి మొక్కలు విడుదల చేయాలన్నారు. నాటి న ప్రతి మొక ఖచ్చితమైన లెక్కలతో, మొక్కలను బతికించాల న్నారు. ఈ పనులకు ప్రభుత్వ పరంగా చెల్లించే సొమ్ము గురించి రైతులు, గ్రామస్థులకు అవగాహన కల్పించాలని అధి కారులను ఆదేశించారు. ఈ పనుల పట్ల అవగాహన కల్పించేం దుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. మన జిల్లాలో చెట్లు తక్కువగా వున్న లింగంపేట, తాడ్వాయి, బాన్సువాడ, కమ్మర్ పల్లి మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైనట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

మూడు సంవత్సరాల్లో 3కోట్ల మొక్కలు..
హరితహారం కింద జిల్లాలో మూడు సంవత్సరాల్లో 3కోట్ల మొక్కలు నాటించడమే ప్రభుత్వ లక్షమని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 1.7 లక్షల హెక్టార్ల అడవులను కారడవులుగా మార్చేందుకు కోటి మొక్కలను, పొలాలగట్లు, నివాస ప్రాంతాల్లో 9 కోట్ల మొక్కలు పెంచనున్నట్లు తెలిపారు. దీనికి అదనంగా చెట్ల విస్తీర్ణం లక్ష హెక్టార్లకు పెరిగి జిల్లాలోని పచ్చదనం 35 శాతానికి చేరుకుంటుందన్నారు. ప్రతి ఇంట, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, కర్మగారాల ఆవరణలు పండ్లు మొక్కలతో అలరారాని సూచించారు. పొలాల గట్లపై కోటి టేకు చెట్లు నాటించేందుకు రైతులను చైతన్యవంతులను చేయాలన్నారు. టేకు కాండమును రెండున్నర ఇంచుల వెడల్పు గల గడ్డపారపాదులలోనాట వచ్చని తెలిపారు. చెరువు కట్టలపై నాటేందుకు 7 లక్షల ఈత మొక్కలు, 3 లక్షల కర్జూర మొక్కలు సిద్దంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. చెరువు శిఖం భూములలో సిల్వర్‌ఓక్ చెట్లు నాటాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పిచైర్ పర్సన్ డి. రాజు, ఎంఎల్‌సి విజిగౌడ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, సంయుక్త కలెక్టర్ ఎ. రవీందర్‌రెడ్డి, ముఖ్య అటవీ సంరక్షణ అధికారి ఎస్‌కె గుప్త, డ్వామా పిడి, డిఎప్‌ఒ తదితరులు పాల్గొన్నారు.