Home కామారెడ్డి కులవృత్తులకు సర్కారుపెద్దపీట

కులవృత్తులకు సర్కారుపెద్దపీట

Pocharam Srinivas Speech About Rajaka Devlopmets

మనతెలంగాణ/కామారెడ్డి: సమాజంలో నిరుపేద వర్గాల అభ్యున్నతికి బడ్జెట్‌లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా రజక మహసభ కిరాణవర్తక సంఘ భవనంలో జరిగింది. ముఖ్య అథితిగా విచ్చేసిన పోచారం మాట్లాడుతూ నిరుపేదల కోసం యంబిసి కార్పోరేషన్ కెసిఆర్ ఏర్పాటు చేశారని ఈ కార్పొరేషన్ ద్వారా రజక, మంగళి, వండ్రంగి, కమ్మరి, కుమ్మ రి, యాదవ, గీత మత్స్య కార్మికులను చేతి వృత్తుల వారికి ఈ కార్పొరేషన్‌లలో విరివిగా రుణాలు ఇస్తామని తెలిపారు. గత ప్రభుత్వాలు సంచార జాతులను, నిరుపేదలను విశ్మరించారని వారికి కెసిఆర్ గుర్తింపు తెచ్చారని మంత్రి తెలిపారు. యంబిసి రూ.వెయ్యి కోట్ల బడ్జెట్‌లో రూ.250 కోట్లు రజకులకు రూ.250 కోట్లు నాయీ బ్రాహ్మణులకు అధునాతన దోబి ఘాట్‌ల నిర్మాణానికి అధునాతన సెలూన్‌ల ఏర్పాటుకు ఖర్చు చేస్తున్నామన్నారు. రజకులు చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. నిరుపేదలకు చేతివృత్తుల వారికి బ్యాం కులతో సంబంధం లేకుండా రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తున్నామన్నారు. యాదవులకు 50 లక్షల గొర్రెలను పంపిణీ చేశామన్నారు. రజకులు బుద్ధి, ఆలోచన కలవారని వారి సేవలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు.

ఎవరి కాళ్లపైన వాళ్లే బతకడానికి చేతి వృత్తులకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. దళారుల చేతిలో మత్సకారులు నష్టపోకుండా తగు చర్యలు తీసుకుంటుందున్నారు. గ్రామాల్లో రైతులు చేతి వృత్తుల వారిని ఆదుకోవడానికి ప్రభు త్వం పలు చర్యలు తీసుకుంటుందన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముభారక్, కెసిఆర్ కిట్‌లు పెన్షన్‌లతో అన్ని వర్గాల వారిని ఆదుకుంటున్నామని గుర్తు చేశారు. పన్నెండు వేల కోట్ల రూపాయలతో రైతు పెట్టుబడి పథకం అమలు చేస్తుందన్నారు. ఆగస్టు నుండి ఉచిత రైతు భీమా పథకం ప్రారంభిస్తున్నామన్నారు. ఈ పథకం అమలు కోసం పది రోజుల్లో ప్రతి రైతు ఇంటికి వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సర్వే ప్రారంభిస్తారన్నారు. త్వరలో సింగూరు ప్రాజెక్టు నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తామన్నారు. కామారెడ్డిలో ఒక ఎకరం స్థలం కోటి రూపాయలతో రజక భవనాన్ని మంజూరు చేస్తున్నట్లు మంత్రి పోచారం ఈ సందర్భంగా ప్రకటించారు. జహీరాబార్ ఎంపి నిధుల నుండి 5 కోట్ల రూపాయలను మంత్రి యంపి కి సూచి ంచారు. ప్రభుత్వ విఫ్ గంప గోవర్థన్ మాట్లాడుతూ రజకుల బాగుకోసం ఆదునిక బట్టలు ఉతికే మిషన్లు, అదునాతన దోభిఘాట్‌లు నిర్మిస్తామన్నారు. రజకులకు ఎలాంటి రాజకీయ సహాయాన్ని అందించడానికి సిద్దంగా ఉన్నామన్నారు.ఈ సమావేశంలో మోస్టు బ్యాక్ వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, జహీరాబాద్ యంపి బిబి పాటిల్, ఎల్లారెడ్డి ఎంఎల్‌ఎ రవీందర్‌రెడ్డి, సదాశివనగర్ జడ్‌పిటిసి రాజేశ్వర్‌రావు, డిసిఎంఎస్ చైర్మన్ ముజీబ్, మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మ వెంకట్, గోపిగౌడ్, రజక సంఘం నాయకులు మిరుదొడ్డి రాజయ్య, దత్తాత్రేయ, రాజయ్య, సంజీవులు తదితరులు పాల్గొన్నారు.
భారీగా టిఆర్‌ఎస్ లోకి చేరికలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన రజక మహాసభలో పలు పార్టీలనుంచి నాయకులు మంత్రి పోచారం సమక్షంలో టిఆర్‌ఎస్ లో చేరారు. కాంగ్రేస్ నాయకులు మిరుదొడ్డి రాజయ్య టిడిపి కౌన్సిలర్ మోచి శంకర్, టిడిపి నాయకులు చాకలి భూమయ్య రాజయ్యలు వారి భారీ అనుచర గణంతో పార్టీలో చేరారు. వారికి మంత్రి పోచారం, విప్ గోవర్ధన్, యంపి పాటిల్, ఎంఎల్‌ఎ రవీందర్‌రెడ్డిలు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.