Home ఎడిటోరియల్ సూర్యుని వాంగ్మూల దర్పణం

సూర్యుని వాంగ్మూల దర్పణం

Poet1

సమాజంలోని విభిన్నసమస్యల్ని తన కవి త్వం ద్వారా వివరించే ప్రయత్నమే “సూర్యుని వాంగ్మూలం” కవితా సంపుటి విశిష్టత. కవి-ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ఈ కవితా సంపుటిలో రైతు పక్షపాతిగా కనిపిస్తాడు. “విత్తు విత్తుకూ ప్రాణం పోసి ( ఎలా ఎత్తుగా ఎదగాలో నేర్పించే రైతు ) చెట్టు కొమ్మకు ఉరితాడుతో వేళ్లాడితే” ఈ కవి మనస్సు తట్టుకోలేకపోయింది.“గుండె చెదర కు/ గూడుచెరచకు” అనే హెచ్చరిక చేస్తూనే “మేమంతా నీ తోడు” అనే భరోసాను రైతుకు అందించాడు.

రైతుకు అనుబంధంగా వుంటూ రైతు చెమటతో తడిసిన మట్టితో విత్తనాలు చల్లి – నాట్లు వేసి – పంటలు కోసి ఇంటికి చేర్చే వరకూ ఆడ కూలీల శ్రమ అనన్య సామాన్యమైనదనీ, వారి పాదాలు నీళ్లల్లోనూ-పొలంలో తడిసీ మడిమెలు పగిలి నెత్తురు – చీమూ కారుతున్నా పనికి ఎగనామం పెట్టరనీ, వారి శ్రమను ఎవరూ గుర్తించటంలేదని మదనపడుతాడు. ఇంటా, బయట స్త్రీల శ్రమ విలువపై కవికి అపారమైన గౌరవం ఉంది. “అమ్మరుణం” పేరుతో చిత్రించిన ఈ కవితలో ప్రపం చం ఆమె పాదాల ముందు ప్రణమి ల్లాలనీజడ్జిమెంటు ఇచ్చేస్తాడు. బతుక మ్మను గురించి రాసిన కవిత “పూల శిఖరం”లో పల్లె స్త్రీలు రైతుకు పెద్దన్న లాంటివారనీ ఆ రైతన్నలు పండించే మెతు కమ్మలు, మన బతుకమ్మలు అని కీర్తించటం బాగుంది.

వరుసగా కాలం కాక పల్లెటూరు కూలీలూ – రైతులూ పట్నం వలసలు పోవటం పరిపాటి. యాదమ్మ ఆమె భర్త నరసింహ్మ కుటుంబం కూడా పట్నంలో బతుకుతుంటే నరసింహ్మ రోగా లపాలై మందులకు డబ్బుల్లేక చనిపోతాడు. అతడి చావు – తదనంతర కార్యాలు చందాలూ- దాన ధర్మాలతో జరిగిపోతాయి. అదే నెలలో నరసిం హ్మం” నెల మాసికం వస్తుంది. డబ్బుల్లేవు యాద మ్మ భర్త నెలమాసికం చెయ్యలేని అశక్తురాలు అయినా భర్త ఫోటోకు బొట్టుపెట్టి నీళ్లు ఆరబోసి పిల్లలూ తనూ దండం పెట్టుకుని పైసా ఖర్చు లేకుండా ‘నెల మాసికం’ కానిచ్చేసింది. ఆర్థిక ఇబ్బందుల్ని ఎట్లా అధిగమించవచ్చో చక్కగా చిత్రించిన కవిత ఇది.

అంతేకాదు ఇలాంటి కార్యక్రమాలకు డబ్బులు తగలేసి అప్పుల్లో కూరుకుపో వటం సరైంది కాదు అనే సందేశం ఇమిడి ఉంది. కలకత్తాలో ఓ ఫ్లై ఓవర్ కూలిపోయింది మన దృష్టిలో కలిగిన నష్టం ప్రాణాలూ – నీతి – అవినీతి కనబడతాయి కాని కవి మాత్రం ఈ “కలకత్తా విషాదం”లో “నిన్నూ నన్ను కలిపే/ ఒక మహా నిర్మాణం/ అకస్మాత్తుగా విరిగిపడింది/ నీవు అక్కడా/ నేను ఇక్కడ/ నిస్సహాయులుగా విడిపోయాం” అని అంటారు. ఒక మానవీయ కోణం తళుక్కున మెరుస్తుంది.

మెదక్ మూసాయిపేట రైలు పట్టాలమీద రక్తసిక్తమైన బాల్యం గూర్చి వేగంగా వచ్చే రైలు సరాసరి తల్లుల కడుపుల్లోకి పరుగెత్తిందనే స్వభావోక్తిని హృద య విదారకంగా చిత్రించా డు. పసివాళ్లకు బతికే హక్కే లేదా? అని ప్రశ్నిస్తూ అక్కడి గుళకరాల్లు ఆ విషాదాన్ని నెత్తుటి కళ్లతో కళ్లారా చూసాయని ఆ గులకరాళ్లకు వున్న ముందు చూపు ప్రభుత్వాలకు లేదని గర్జించాడు.

బంగారు వన్నెల కందిపప్పు సామాన్యులకు అందు బాటులో వుండే ధరతో దుకాణాల లో నేలమీద ఉండేది కానీ అది ఇప్పుడు దుకాణాలలో అల్మారాల అద్దాలలో జీడి పప్పుల పక్కన తిష్టవే సిందనీ చమత్కారంగా వర్ణించిన తీరు బాగుంది. చివరగా అనాధల బాల్యం వారు ఎంచుకున్న పనుల్లోని నైపుణ్యం ఈ దేశ ప్రజలు ఆలోచించ దగ్గ గొప్ప వార్తలనీ కితాబు ఇవ్వటం బాగుంది.ఏ ఇజాలకూ లోనుకాని కవి లక్ష్మీనారా యణ గారు మార్మికత, సంక్లిష్టత, అస్పష్టతల్లేని స్వచ్ఛమైన కొబ్బరి నీళ్ల లాంటి కవిత్వం అందించినందుకు అభినంది స్తూ… శిల్పం – అభివ్యక్తిపట్ల శ్రద్ద వహిస్తే బాగుం టుందని సూచన.

Paramatma1పరమాత్మ
9848552512