Monday, September 25, 2023

‘పాయింట్ మెషిన్లు’ తయారు చేసే మూడో యూనిట్‌గా దక్షిణమధ్య రైల్వేకు గుర్తింపు

- Advertisement -
- Advertisement -

మెట్టుగూడ యూనిట్‌కు ఏడాదికి 3,250 వరకు మెషిన్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం

Point Machine made in South central railway
మనతెలంగాణ/హైదరాబాద్:  పాయింట్ మెషిన్లు తయారు చేసే మూడో యూనిట్‌గా దక్షిణమధ్య రైల్వే గుర్తింపు పొందింది. రైళ్ల సురక్షిత పయనంలో ఉపయోగపడే ‘పాయింట్ మెషిన్లు’ ఇక నుంచి దక్షిణమధ్య రైల్వే పరిధిలోని మెట్టుగూడ సిగ్నల్ టెలికమ్యూనికేషన్స్ యూనిట్‌లో తయారు కానుండగా వాటిని ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియాలో భాగంగా దక్షిణమధ్య రైల్వే వీటిని తయారు చేసి సరఫరా చేయనుంది. ‘పాయింట్ మెషిన్లు’ వల్ల ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తుంటే అందులో ఒకటి లూప్ లైన్‌లోకి వెళితేనే రెండోది ముందుకు సాగుతుంది. లేదంటే రెండూ ఢీకొంటాయి. డబుల్ లైన్‌లో వెళుతున్న రైలు మధ్య స్టేషన్‌లో ప్రయాణికుల్ని ఎక్కించుకోవాలన్నా, దింపాలన్నా ప్లాట్‌ఫాంకు వెళ్లాలి. దీనికోసం ప్రధానమార్గం నుంచి ట్రాక్ మారాల్సిందే. ఇలాంటి సమయంలో ట్రాక్‌పై రైలు దిశను మార్చడంతో పాటు, సురక్షితంగా బండి ముందుకెళ్లాలంటే ‘పాయింట్ మెషిన్’ లేదా పాయింట్ మోటార్ ఉండాలి. రైలు లైను మారేటప్పుడు దాని గమనాన్ని సురక్షితంగా లాక్ చేయడంతో పాటు రైళ్ల వేగంతో వచ్చే ప్రకంపనల నివారణలోనూ పాయింట్ మెషిన్లు కీలకపాత్ర పోషిస్తాయి. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో వీటిని ఇప్పటివరకు రెండుచోట్లే తయారుచేస్తున్నారు. డిమాండ్‌కు సరిపోక ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు.

పాయింట్ మెషిన్ల జీవితకాలం 12 సంవత్సరాలు

ఈ నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియాలో భాగంగా పాయింట్ మెషిన్ల తయారీ, సరఫరాకు దక్షిణమధ్య రైల్వే పరిధిలోని మెట్టుగూడ సిగ్నల్ టెలికమ్యూనికేషన్స్ యూనిట్ అనుమతి పొందింది. ఈ యంత్రాల తయారీకి అవసరమైన అంతర్గత సాంకేతికతను తాజాగా అభివృద్ధి చేసింది. 143ఎం.ఎం., 220 ఎం.ఎం. పాయింట్ మెషిన్ల తయారీ, సరఫరా చేసే మూడో యూనిట్‌గా గుర్తింపు పొందింది. పాయింట్ మెషిన్లు భారీగా, తక్కువ ధరకే లభిస్తాయని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. వీటి జీవితకాలం 12 ఏళ్లని, మెట్టుగూడ యూనిట్‌కు ఏడాదికి 3,250 వరకు మెషిన్ల ఉత్పత్తి సామర్థ్యం ఉందని, తద్వారా ద.మ.రైల్వే అవసరాలను తీర్చడంతో పాటు ఇతర జోన్లకూ సరఫరా చేసేలా కృషి చేస్తున్న అధికారులు, సిబ్బంది కృషిని జిఎం గజానన్ మాల్యా అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News