Home రాష్ట్ర వార్తలు కాలేజీ మానుకోనందుకు బాలిక గొంతులో విషం

కాలేజీ మానుకోనందుకు బాలిక గొంతులో విషం

పురుగుమందు తాగించి పారిపోయిన ముసుగు మనిషి
నిజామాబాద్ జిల్లాలో దారుణం

poisonమాచారెడ్డి: కాలేజీ వెళ్తున్న విద్యార్థినికి ఓ అగం తకుడు బలవంతంగా పురుగుమందు తాగించి పరారైన ఘటన నిజా మాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. చుక్కాపూర్ గ్రామానికి   చెందిన చెన్నూరు బాలలక్ష్మి(16) మాచారెడ్డి జూనియర్ కళాశాలలో ఇంటర్మిడియట్ ప్రథమ సంవత్సరం (బైపిసి) చదువుతోంది. ఉదయం 9.3౦గంటల ప్రాంతంలో రోజు మాదిరిగానే కళాశాలకు బయలుదేర గా మార్గమధ్యలో ముసుగు వేసుకుని బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్య క్తి చేతులకు మాస్కులు వేసుకుని కళాశాల వెళ్లొద్దంటే ఎందుకు వెళ్తు న్నావని బలవంతంగా పురుగుల మందు నోట్లో పోసి పారిపోయాడని ఆమె చెప్పింది. గత సోమవారం ఇదే సమయానికి బైక్‌లో వచ్చి కళాశా లకు వెళ్లొద్దని హెచ్చరించాడని, ఆయన ఎవరో గుర్తుపట్టలేదని, అరు పులు కేకలు వేయడంతో చుట్టూ ప్రక్కల వారు వచ్చి కామారెడ్డి ఏరి యా ఆసుపత్రికి తరలించారని బాధితురాలు తెలిపింది. ఇప్పటి వరకై తే ఎలాంటి ప్రాణపాయం లేదని, 24 గంటల తర్వాత ఏ విషయం తెలియజేస్తామని వైద్యులన్నారు. సంఘటనపై స్టేట్‌మొంట్ రికార్డు చే సి దర్యాప్తు  చేస్తున్నట్లు కామారెడ్డి రూరల్ సిఐ కోటేశ్వర్‌రావు తెలిపారు.