Home నిజామాబాద్ నిఘాపై నిర్లక్షం

నిఘాపై నిర్లక్షం

Police aim at setting up cc cameras

సిసి కెమెరాల ఏర్పాటులో పోలీసుల అలక్షం
నిజామాబాద్ నగరంలో కొన్ని కూడళ్లలోనే నిఘా కెమెరాలు
వాటిలోను పనిచేసేవి కొన్నే
కీలకమైన ప్రాంతాల్లో కరువైన నిఘా
కామారెడ్డిలో రికార్డు స్థాయిలో కెమెరాల ఏర్పాటు

మన తెలంగాణ/నిజామాబాద్ : నేరస్థుల ఆటకట్టించడం, శాంతి భద్రతలను కాపాడడంలోను ఆధునిక సాంకేతికతను వినియోగించడంలో పోటీ పడుతున్న పోలీసుశాఖ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది. నేరాల అదుపు, నేరస్థుల గుర్తింపుకు కీలకంగా పనిచేసే నిఘా కెమెరాలను ఏర్పాటు చేయడంలో పోలీసులు అశ్రద్ద వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా నేరస్థులు పోలీసులను బురిడీకొట్టించే అవకాశం ఉండగా, నేరాల్లో పరిశోధనకు పోలీసులకు ఇబ్బందిగా మారే పరిస్థితి ఉంది. నిజానికి రాష్ట్ర పోలీసు శాఖ సైతం పోలీసులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పోలీసులు మారాల్సిందేనని ఆ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. అందుకు సిబ్బందికి సాంకేతిక శిక్షణనిస్తున్నారు. నేర పరిశోధనలోను పోలీసులు ముందు వరుసలో నిలిచేలా సంస్కరణలు తెస్తున్నారు. నేరస్థులు అడుగుతీసి అడుగువేస్తే పసిగట్టేలా రాష్ట్రమంతా నిఘా పెంచాలని భావిస్తుండగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలీసు శాఖ స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ప్రధానంగా నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో నిఘా పూర్తిగా కొరవడినట్లు ఆ శాఖ వర్గా లు స్పష్టం చేస్తున్నాయి. నిజామాబాద్ నగరం నలుమూలలా విస్తరించ గా అందుకు తగ్గట్టుగా ని ఘాను పెంచుకోవడంలో పో లీసు శాఖ పూర్తిగా విఫలమైంది. గతంలో పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు సైతం మొరాయిస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్‌లో ఎన్‌టిఆర్ చౌరస్తా, లక్ష్మిమెడికల్, పులాంగ్ చౌరస్తా, బోధన్ బస్టాండ్, కంఠేశ్వర్, ఆర్టిసి బస్టాండ్ ప్రాంతాల్లో మాత్రమే గతంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా 64 కెమెరాలు నగరంలో ఏర్పాటు చేయగా ప్రస్తుతం వీటిలో ఎన్‌టిఆర్ చౌరస్తా, బోధన్ బస్టాండ్, కంఠేశ్వర్ ప్రాంతాల్లోని సిసి కెమెరాలు పనిచేయడం లేదని సమాచారం. దాదాపు 30 కెమెరాలు రోడ్డు పనులతో పనిచేయడం లేదు. మరోవైపు సిసి కెమెరాలు నాణ్యమైనవి కాకపోవడం వల్ల రెండుమూడేళ్లకే పాడవుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి సిసి కెమెరాల నివారణకు గతమూడేళ్లుగా నిధుల కొరత ఉండడంతో కమిషనర్ చొరవతో తాత్కాలికంగా నెట్టుకొస్తున్నారు. ఒక ఎస్‌ఐతో పాటు కొంత మంది సిబ్బందిని సిసి కెమెరాల నిర్వహణకు వినియోగిస్తుండగా కేబుల్ పనిచేయని సందర్బాల్లో వాటిని సరిచేసే సాంకేతికత, సామాగ్రి పోలీసు సిబ్బంది వద్ద లేకపోవడంతో పలు కెమెరాలు నిరుపయోగంగానే ఉన్నా యి. దీంతో నేరస్థుల కదలికలను పసిగట్టే అవకాశం లేకుండాపోగా ఆయా ప్రాంతాల్లో అసాధారణ పరిస్థితులు, నేరం జరిగితే పోలీసులు గుర్తించలేని పరిస్థితి నెలకొంది. నిజానికి నిజామాబాద్ నగరంలో అనేకసార్లు నేరస్థుల గుర్తింపు పోలీసు శాఖకు కష్టంగా మా రింది. పలు ప్రాంతాల్లో నేరాలకు పాల్పడ్డ దుండగులు నిజామాబాద్‌లో ప్రవేశించి తెలివిగా తప్పించుకొని పోయారు. మెదక్, కరీంనగర్ తదితర ప్రాంతాల పోలీసులు నిజామాబాద్ పోలీసుల సహకారం కోసం వచ్చిన సందర్భాల్లో నిఘా పరంగా డొల్లతనం వెల్లడైన ట్లు సమాచారం. నిజామాబాద్ నగరానికి గతంలో హై దరాబాద్ రోడ్, న్యాల్‌కల్‌రోడ్, బోధన్‌రోడ్డు ప్రాం తాల్లో కీలకం కాగా నగరంలోకి ప్రవేశించిన వారు ఇత ర ప్రాంతాల్లోకి వెళ్లేందుకు ఆ మార్గాల గుండా ప్రయాణించాల్సి వచ్చేది. నేరస్థులు నగరంలోకి ప్రవేశించినా, నగరం దాటి వెళ్లినా కొన్నిచోట్ల సిసి కెమెరాలకు చిక్కే అవకాశం ఉండేది. బైపాస్ రోడ్డు ఏర్పాటుతో నేరస్థులకు దొడ్డిదారి దొరికినట్లైంది. బైపాస్ రోడ్డు మార్గంలో పోలీసులు నిఘా పెంచుకోకపోవడం ఆ శాఖ పనితీరును వెల్లడిస్తుంది. మరోవైపు నగరంలో నేరాల అదుపునకు సైతం సిసికెమెరాలు పెంచాలన్న ప్రయత్నాలు జరగడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని గ్రామీణ పోలీస్‌స్టేషన్లలో మాత్రం సిసి కెమెరాల ఏర్పాటుపై పోలీసుశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో సిసికెమెరాల ఊసే కనిపించడం లేదని సమాచారం. ఇదిలా ఉంటే కామారెడ్డి జిల్లా కేంద్రంలో గతంలో 60 సిసి కెమెరాలు ఉండగా పట్టణ ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్‌కుమార్ నిఘాపైనే ప్రధానంగా దృష్టి పెట్టడం గమనార్హం. పట్టణంలోని అన్ని కూడళ్లలో, ప్రధానమైన ప్రాంతాల్లో సిసి కెమెరాల ఏర్పాటు చేశారు. మొత్తం కామారెడ్డిలో ఇప్పటి వరకు 160 సిసి కెమెరాలు ఏర్పాటు కాగా పట్టణం మొత్తం పోలీసుల నిఘాలోకి వెళ్లిపోయినట్లయింది. గతంలో కామారెడ్డిలో జరిగిన కత్తిపోట్ల ఘటనతో భారీగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు స్పష్టమవుతోంది. సిఐ శ్రీధర్ మరింత చొరవతీసుకొని ప్రతి కాలనీల్లోను సిసికెమెరాలు ఏర్పాటు అయ్యేలా ప్రజలను చైతన్యపరుస్తుండడం గమనార్హం. వాణిజ్య, వ్యాపార వర్గాలకు సైతం సిఐ సిసి కెమెరాల కోసం తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. బోధన్, ఆర్మూర్ ప్రాంతాల్లోను మరిన్ని సిసి కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.