- Advertisement -
మనతెలంగాణ/ నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నాల్గవ టౌన్ పోలీసుల నిర్వాకం ఎలా ఉంటుందో తెలియజెప్పే సంఘటన ఇది. నిజామాబాద్ పట్టణంలో నాల్గవటౌన్ దాని పక్కనే ఉన్న సిసిఎస్ పోలీస్‌స్టేషన్లను మోడల్ పోలీస్‌స్టేషన్‌లుగా మారుస్తున్న తరుణంలో మరమ్మత్తుల కారణంగా ఎంతో గౌరవప్రదంగా చూసుకోవాల్సిన డాక్టర్ అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్‌లాంటి మహనీయుల చిత్రపటాలను గోడల నుంచి తొలగించి లాకప్‌లో పెట్టిన సంఘటన ఇది. చిత్రపటాలు పెట్టడానికి ఎక్కడా స్థలం లేనట్టు కటకటాల వెనక పెట్టడం వారి పట్ల ఉన్న గౌరవాన్ని తె లియజేస్తుంది. ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై స్పందిస్తారని ఆశిద్దాం.
- Advertisement -