Thursday, April 25, 2024

పిడిఎస్‌యూ అసెంబ్లీ ముట్టడి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః తెలంగాణ అసెంబ్లీ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్‌యూ సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో అసెంబ్లీ పరిసరాల్లో పోలీస్ అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

అసెంబ్లీని ముట్టడించేందుకు వచ్చిన పిడిఎస్‌యూ కార్యకర్తలతో అసెంబ్లీ ఆవరణ, నాంపల్లి చుట్టుపక్కల ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని, బడ్జెట్‌లో విద్యాశాఖకు 30శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News