Home తాజా వార్తలు రామానందప్రభు స్వామీజీ అరెస్ట్

రామానందప్రభు స్వామీజీ అరెస్ట్

Police arrest ramananda prabhu swamiji

 

ఆశ్రమం వద్ద ఉద్రిక్తత..
పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు

మనతెలంగాణ/(బొమ్మలరామారం)యాదాద్రి భువనగిరి: లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో రామానంద ప్రభూజీని రాచకొండ, యాదాద్రి భువనగిరి జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2016 2018లో స్వామీజీ అత్యాచారం చేసినట్లు… ఓ యువతి యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో స్వామీజీని అరెస్ట్ చేసిన పోలీసులు భువనగిరి ఎసిపి కార్యాలయానికి తరలించి, అతనిపై కేసు నమోదు చేసి నల్లగొండ కోర్టుకు తరలించారు. వివరాల్లోకి వెళితే… జిల్లాలోని బొమ్మల రామారం మండలం పెద్దపర్వతాపూర్ గ్రామ సమీపంలోని, కీసర శివారు ప్రాంతాల్లో, రామనంద ప్రభుజీ అనే వ్యక్తి శ్రీ సాయి ధామమ్ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయి తే నల్లగొండ శిశు విహార్ నుంచి సాయి ధామానికి వచ్చిన అనాధ బాలిక 20162018 వరకు ఆశ్రమంలోనే జీవనం సాగించింది. అయితే రామనంద ప్రభుజీ తనపై లైంగికదాడికి పాల్పడినట్టు ఆ అనాధ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దాంతో బాలిక 2018లోనే వేధింపుల తర్వాత హై దరాబాద్ అమీర్‌పేట్ స్టేట్ హోమ్‌కు వెళ్లి పోయిన్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో అనాధ అమ్మాయి బొమ్మలరామారం పోలీసులకు ఫిర్యాదు చే యడంతో భువనగిరి ఏసీపీ అధ్వర్యంలో స్వామిజీ పై కేసు నమోదుచేశా రు. ఈనేపథ్యంలో బోమ్మలరామారం పోలీసులు గురువారం అర్ధరాత్రి స్వామిజీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భువనగిరి పట్టణంలో ని ఎసిపి కార్యాలయానికి తరలించి స్వామీజీపై ఐదు సెక్షన్ల కింద కేసు న మోదు చేశారు. ఇదిలా ఉండగా సాయి దామం ఆశ్రమ భూమి కబ్జాకు ఓ సిమెం ట్ ఫ్యాక్టరీ ఓనర్ ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే కబ్జాకు గురికాకుండా అడ్డుపడుతున్నందుకే స్వామీజీపై ఓ మహి ళ 2016,2018లో జరిగినట్లు ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

కావాలనే స్వామిజీ అరెస్ట్, ఖండించిన స్థానికులు
యాదాద్రి భువనగిరి జిల్లా బోమ్మలరామారం మండలంలోని పెద్ద పర్వాతాపురం శివారులో గల సాయిధామం, ఆశ్రమం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆశ్రమానికి చెందిన రామనందప్రభు స్వామీజీని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రామనందప్రభు స్వామీజీని ముందస్తు నోటీసులు లేకుండా అరెస్ట్ చేశారని అక్కడివారు చెబుతున్నారు. అర్ధరాత్రి వేళ ఆకస్మాత్తుగా అరెస్ట్ చేశారని తెలిపారు. అక్రమార్కులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఓ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని.. సాయిధామం ఆశ్రమ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని, అందుకు అడ్డుపడుతున్నందుకే స్వామిజీపై వేధింపులకు పాల్పడుతున్నారని, అం దుకే అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశ్రమ సభ్యులతో పా టుగా, హిందూ సంఘాలు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్వామీజీని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు స్వా మీజీ వేధింపులకు పాల్పడినట్టుగా ఓ మహిళ ఫిర్యాదు చేసిందని.. అందుకే ఆయనను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్పారు. ఇక, బొమ్మలరామారం మండలంలోని పెద్ద పర్వాతాపురం గ్రామ సమీపంలో శ్రీ సత్యాపదనంద ప్రభూజీ 1989లో సాయిధామం ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఆశ్రమంలో సాయిబాబా దేవాలయాన్ని నిర్మించారు. ప్రతి ఏడాది సాయిధామంలో గు రుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేవారు. అయితే 2015లో సత్యపదానంద ప్రభూజీ శివైక్యం చెందారు. ఆ తర్వాత ఆశ్రమ నిర్వహకులు అధిపత్యం కోసం రెండు వర్గాలుగా చిలిపోయారు. ఈ క్రమంలోనే కొంతకాలంగా ఆశ్రమంలో గొడవలు జరుగుతున్నాయని వినికిడి.

Police arrest ramananda prabhu swamiji