Home తాజా వార్తలు మహేష్‌బాబు “బ్రహ్మోత్సవం” వీడియో గ్రాఫర్లు అరెస్ట్

మహేష్‌బాబు “బ్రహ్మోత్సవం” వీడియో గ్రాఫర్లు అరెస్ట్

mahesh-bramosthavam-imageతిరుమల : మహేష్‌బాబు ‘బ్రహ్మోత్సవం’ చిత్రం వీడియో గ్రాఫర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. రథసప్తమి పర్వదినంలో భాగంగా శ్రీవారి గరుడ సేవలను చిత్రీకరిస్తున్న ఇద్దరు వీడియో గ్రాఫర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాధునిక కెమెరాలతో తిరుమల వీధుల్లో అనుమతి లేకుండా వీడియో షూటింగ్‌పై సమాచారం అందింది. ఈ మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వీడియో గ్రాఫర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా బ్రహ్మోత్సవం చిత్రం కోసం వీడియోలను చిత్రీకరిస్తున్నట్లు వెల్లడించారు. అనుమతి లేకుండా వీడియోలు ఎలా తీస్తారని పోలీసులు ప్రశ్నించారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. మహేష్‌బాబు కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.