Friday, March 29, 2024

ఆన్‌లైన్ మోసగాళ్ల అరెస్టు

- Advertisement -
- Advertisement -

Online-Cheaters

బెల్లంపల్లి : క్లబ్ ఫ్యాక్టరీ ఆన్‌లైన్ పేరుతో మోసాలు చేస్తున్న పలువురిని బెల్లంపల్లి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. 1టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎసిపి ఎంఎ రహెమాన్ ఈ ఘటన వివరాలను తెలిపారు. దహెగాం మండలం కమ్మరపల్లి గ్రామానికి చెందిన రామటెంకి గవస్కర్, చింతలమానెపల్లికి చెందిన దుర్గం దిలీప్,దేవులగూడకు చెందిన జరుపుల నరేందర్,చింతలమానెపల్లికి చెందిన తామెర తిరుపతి, నెన్నెలకు చెందిన జాతోర్ శ్రీనివాస్ అనే వ్యక్తులు కోల్‌కత్తాలోని ఉదయ్ అనే సైబర్ నేరస్థునితో పరిచయం చేసుకున్నారు.

ఈ క్రమంలో బెల్లంపల్లికి చెందిన బమ్మిడి రాహుల్ అనే వ్యక్తికి ఫోన్ చేసి, మీకు కారు బహుమతిగా వచ్చిందని నమ్మించారు. కారు కావాలా లేదా 13 లక్షలు కావాలా అని వారు రాహుల్‌ను అడిగారు. తమ బ్యాంక్ ఖాతా ద్వారా జిఎస్‌టి, ఇతర ట్యాక్సీల డబ్బులు జమ చేయాలని నిందితులు బమ్మడి రాహుల్‌కు సూచించారు. దీంతో జనవరి 1న బాధితుడు రూ. 7500లు వారి బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేశాడని, అనంతరం మళీ సుమారు 4లక్షల వరకు బాధితుడు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేశాడని ఎసిపి తెలిపారు. అనంతరం నిందితులు బహుమతి పంపించకుండా బాధితుడిని మోసం చేసినట్లు ఎసిపి తెలిపారు. బాధితుడు రాహుల్ 1టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని, విచారణ చేసి నిందితులను అరెస్టు చేసినట్లు ఎసిపి వెల్లడించారు. ఈసమావేశంలో ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

Police Arrested Online Cheaters in Adilabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News