Home Default మహిళలను చంపి.. ఆపై అత్యాచారం…

మహిళలను చంపి.. ఆపై అత్యాచారం…

Rapeఅమరావతి: చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మహిళలను దారుణంగా హత్య చేసి ఆ తర్వాత అత్యాచారం జరిపి పైశాచిక ఆనందం పొందుతున్న ఆనంద్ అనే కామాంధుడిని చిత్తూరులో జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గత కొంతకాలంగా నిందితుడు ఆనంద్‌ మహిళలను చంపి అనంతరం అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అయితే ఇప్పటికే చిత్తూరులో ఇద్దరు మహిళలను, తమిళనాడులో మరో ఇద్దరు మహిళలను ఆనంద్‌ దారణంగా హత్య చేశాడు. ఒంటరిగా ఉన్న మహిళలనే ఈ సైకో కిల్లర్ టార్గెట్ చేస్తున్నాడు. గతంలో కూడా ఆనంద్ పై పలు కేసులు ఉన్నాయి. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
police arrested psycho killer at Chittoor