Home రాష్ట్ర వార్తలు భూ కుంభకోణంలో సబ్‌రిజిస్ట్రార్ అరెస్టు

భూ కుంభకోణంలో సబ్‌రిజిస్ట్రార్ అరెస్టు

                         Sub-Register

సిటీ బ్యూరో: హైదరాబాద్ నగ రం శేరిలింగంపల్లి మండ లం మియాపూర్ గ్రామం లో వెలుగు చూసిన భారీ భూ కుంభకోణం కేసులో కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావును, బిల్డర్లు బిఎస్ పార్థసారథి, పివిఎస్ శర్మలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిం చారు. రూ.587 కోట్ల విలువైన 698 ఎకరా ల ప్రభుత్వ భూమిని కూకట్‌పల్లి సబ్‌రిజిస్టార్ రాచకొండ శ్రీనివాసరావు (56) నలుగురు బిల్డర్లకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ కుంభకోణంపై  మేడ్చల్ జిల్లా రిజిస్టార్ ఎన్.సైదిరెడ్డి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో కూకట్‌పల్లి పోలీసులు సబ్‌రిజిస్టార్‌తో పాటు మరో ఇద్దరు బిల్డర్లను అరెస్టు చేసి జైలుకు తరలిం చారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శ్యాండిల్యా కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శేరిలింగం పల్లి మండలం మియాపూర్ గ్రామం లో సర్వేనెంబర్ 101, 20, 28, 100లలో రూ.587 కోట్ల విలువచేసే 698 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూములను కూకట్‌పల్లి సబ్ రిజిస్టార్ శ్రీనివాసరావు బిల్డర్లతో కుమ్మకై జూబ్లీహిల్స్‌లో నివాసముంటు న్న ట్రినిటి ఇఫ్రా వెంచర్స్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ పి.ఎస్.పార్థసారథి (60), సువిషాల్ పవర్ జెన్ లిమిటెడ్ డైరెక్టర్ పి.వి.ఎస్.శర్మ (72)లతో పాటు మరో ఇద్దరు బిల్డర్లకు రిజిస్ట్రేషన్ చేశారు.

ఈ వ్యవహారం బయట పడడంతో మేడ్చల్ జిల్లా ఎన్.సైదిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కూకట్‌పల్లి పోలీసులు నిందితులపై క్రైమ్‌నెంబర్ 366/2017పై ఐపిసి 409,418,419,420,423,467,468,471,120(బి) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రభుత్వ భూమిని బిల్డర్లకు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను పోలీసులు కూకట్‌పల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకుని పరిశీలించారు. సబ్‌రిజిస్టార్ శ్రీనివాసరావు బిల్డర్ల నుంచి కోట్ల రూపాయల లంచం తీసుకుని అక్రమంగా ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు నిందితులైన శ్రీనివాసరావు, బిల్డర్లు పి.ఎస్.పార్థసారధి, పి.వి.ఎస్.శర్మలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరింత వివరాలు రాబట్టేందుకు నిందితులను పోలీసు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.