Thursday, April 25, 2024

డేటింగ్ యాప్.. యువకుడికి యువతి బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

Police arrested woman who threatened young man

హైదరాబాద్: డబ్బుకోసం యువకుడిని బెదిరిస్తున్న యువతిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన నగరంలోని పేట్ బషీరాబాద్ లో చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం డేటింగ్ యాప్ లో యువతి ఆ అతడికి పరచయమైంది. చనువు కాస్త ముదరడంతో యువతితో యువకుడు నగ్నంగా వీడియోకాల్ మాట్లాడాడు. వీడియోలను రికార్డు చేసి యువతి బెదిరింపులకు పాల్పడుతుంది. డబ్బులు ఇవ్వకుంటే దృశ్యాలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తోంది. దీంతో బాధితుడు పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిని అరెస్ట్ చేశారు. రెండ్రోజుల క్రితం జీడిమెట్లకు చెందిన మరో యువకుడిని యువతి బెదిరించినట్టు పోలీసులు వెల్లడించారు.

Police arrested woman who threatened young man

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News