Home తాజా వార్తలు ఒంటెల వధ స్థావరంపై పోలీసుల దాడి

ఒంటెల వధ స్థావరంపై పోలీసుల దాడి

camel
రంగారెడ్డి: జిల్లాలోని బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సాయి నగర్‌లోని ఫామ్‌హౌస్‌లో ఒంటెలను వధిస్తున్న స్థావరాలపై గురువారం పోలీసులు దాడులు చేశారు. దాదాపు 100 ఒంటెలను, రెండు డిసిఎంలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒంటెలను అస్సాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి తీసుకువచ్చి స్థానికంగా వధించి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పక్క సమాచారంతో బాలాపూర్, పహడిషరీఫ్ పోలీసులు దాడి చేసి నిందితులను పట్టుకున్నారు.