Home జాతీయ వార్తలు ఐస్‌క్రీం పార్లర్లలో వ్యభిచారం గుట్టురట్టు

ఐస్‌క్రీం పార్లర్లలో వ్యభిచారం గుట్టురట్టు

ice-cream-parlourచెన్నై: ఐస్ క్రీం పార్లర్లలో రహస్యంగా నిర్వహిస్తోన్న వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేశారు. తమిళనాడులోని కన్యాకుమారి, నాగర్‌కోవిల్ ప్రాంతంలో ఐస్ క్రీం పార్లర్‌లు ఉన్నాయి. ఈ ఐస్ క్రీం పార్లర్లపై పలుసార్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. గత రెండు రోజులుగా ఐస్ క్రీం పార్లర్లపై పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఓ యువ జంట పోలీసులకు పట్టుబడింది. పార్లర్ యజమానులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐస్ క్రీం పార్లర్లకు ముఖ్యంగా పాఠశాల, కళాశాలలకు చెందిన యువత ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు.