Home ఆదిలాబాద్ పోలీసులకు నూతన పరిజ్ఞానంపై అవగాహన

పోలీసులకు నూతన పరిజ్ఞానంపై అవగాహన

policeఆదిలాబాద్ టౌన్: సోషల్ మీడియా రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నం దున పోలీసులకు సైతం నూతన పరిజ్ఞానాన్ని అందిస్తున్నామని జిల్లా ఎస్పీ డా తరుణ్ జోషి అన్నారు. బుధవారం స్థానిక మెడికల్ కాలేజ్ రిమ్స్‌లోని ఆడిటోరియంలో హైదరాబాద్ రాష్ట్ర ఇంటలిజెన్స్ విభాగం కం ప్యూటర్ అధికారులు పి రంజిత్ కుమార్, ఎస్ రమేష్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు స్టేషన్ రైట ర్లు, కంప్యూటర్ విభాగం పోలీసులకు ఒకరోజు సోషల్ మీడియా, కాల్ డేటా రికార్డ్(సిడిఆర్) లపై అవగాహన సదస్సు నిర్వ హించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసులకు కంప్యూటర్ ద్వారా సమాచారాన్ని ఎలా సేకరించాలనే అం శాలపై తర్ఫీదునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాలకు పాల్పడే నిందితులను గుర్తించే విధం గా జిల్లా పోలీసు అధికారులు కంప్యూటర్‌లోని సోషల్ మీడియాపై అవగాహన ఉండాలన్నారు. అసాం ఘీక శక్తులు, ఉగ్రవాదులు సోషల్ మీడి యాను ఒక సమాచార సాధనగా వాడుకుని దుర్విని యోగం చేస్తున్నారన్నారు. యువకులు ఇటువం టి చర్యలకు ఆకర్షితులై తమన అమూల్యమైన భవిష్యత్తును పాడు చేసుకోవద్దన్నారు. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సప్, టెలిగ్రాం, జి-మెయిల్, తది తర సోషల్ మీడియా వినియోగం పెరిగిందని అన్నారు. పోలీసులు తమ దర్యాప్తులో సాంకేతి క సమాచార్నా సేకరించే విధంగా ఆధునిక పరికరములు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టి పనసారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ బి ప్రవీణ్, ఆర్‌ఐ ఎస్ సురేంద్ర, ఎస్సై యంఏ కరీం, జిల్లా ఐటికోర్ ఇంచార్జి యండి ఫారుఖ్ పాల్గొన్నారు.