Home నాగర్ కర్నూల్ భద్రత పేరున బాదుడు

భద్రత పేరున బాదుడు

వీరికి నిబంధనలు వర్తించవా?
ఇది కరుణా? కక్షా?
పట్టణ పరిధిలో సడలింపు డిమాండ్

Police-Rules

నాగర్‌కర్నూల్ ప్రతినిధి: ప్రాణా లంటే ఎవ్వరికైనా తీపే.వాటిని కాపాడుకోవడానకి ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సిందే. ప్రజల ప్రా ణాలను కాపాడే బాధ్యత ప్రభుత్వాలకు దీనికోసం వారు చేసే చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులకు కూడా ఉందన్నది నిర్వివాదాశం. అయి తే భద్రత పేరున జనాలను వేదించడం,వారికి ఆర్థి కంగా ఇబ్బంది కలిగేలా పెనాల్టిలను విధంచడం నా గర్‌కర్నూల్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపేరున పోలీసులకు నిత్య కృత్యంగా మారిందన్న అభిప్రా యం సామాన్య ప్రజల్లో ఏర్పడింది.

ఒక వేళ నిజంగా వారికి ప్రాణాలను కాపాడాలన్న లక్షం ,కరుణ ఉం టే మరి వారు సైతం నిబంధనలు పాటించి తమ ప్రా ణాలను కూడా ఎందుకు కాపాడుకోవడంలేదన్న ప్రశ్న వేస్తున్నారు. సామాన్య పౌరులకున్న నిబం ధనలు వారికి వర్తించవా అంటున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కొద్దిరోజులుగా ట్రాఫిక్ నియంత్రణ పేరున పోలీసులు చేస్తున్న రచ్చ ,దాని మాటున చేతివాటాలు,ప్రశ్నించినా ,అలాంటి ప్రయ త్నం చేసినా దుర్బాషలాడటం ,ఎదురుదాడికి దిగ డం, పెనాల్టీలను పెంచడం చట్టం పట్ల పోలీసుల కున్న నిర్లక్షం ఇట్టే బహిర్గతమవుతుందన్నది పలు వురిభావన .క్రింది స్థాయి పోలీసుల విషయాలు వెలుగులోకి వచ్చినా ఉదాసీనంగా ఉన్నతాదికా రులు వ్యవహరిస్తే ఇక సామాన్యుల సంగతేంటన్న ప్రశ్న సైతం పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కడ మీ ఆచరణ?

ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీనుండి ట్రాఫిక్ నిబం ధనలు కఠిన తరం చేస్తున్నట్లు జిల్లా పోలీస్ అధి కారి ప్రకటించారు. ఆమేరకు హె ల్మెట్ అవగాహన సదస్సులు,ర్యాలిలుకూ డా నిర్వహించారు. తాము ఆచరిస్తాం మీ లో చైతన్యం తెస్తాం అంటూ ఎస్పీ స్వ యంగా హెల్మెట్ ధరించి మరీ ర్యాలీలో పా ల్గొని అందరికి ఆదర్శంగా నిలిచారు. అం తవరకు బాగానే ఉంది. ఆతర్వాత జరుగు తున్నది ఏంటన్నది పట్టించుకున్న దాఖలా లు లేవు. ప్రజలు మాత్రమే నిబంధనలు పా టించాలి తమకు మాత్రం హెల్మెట్ గిల్మెట్ జాంతానై అంటూ బలా దూర్‌గా తిరుగుతు న్నారు. త్రిబుల్ రైడింగ్‌లు ఇతర ఉల్లంఘ నలు షరామామూలుగానే మారాయి. పో లీసు శాఖలోని చిన్న స్థాయి అధికారినుండి నిత్యం వెంటాడి చాలాన్లు రాసే అధికారు లు సైతం తాము అంతసేపు ఏచట్టం ఉల్లంఘించారని కేసులు రాసారో ఆచ ట్టాన్ని బేఖాతరు చేస్తూ దర్జాజా రోడ్డుపై వెలుతుండటం చూసి ఔరా అంటూ ము క్కున వేలు వేసుకుంటున్నారు.

ఇరుకైన రోడ్లు అనుక్షణం ఎవో పనులు

కాగా నాగర్‌కర్నూల్ పట్టణం పరిధిలో రో డ్డు ఇరుకుగా ఉండటం ,అవికూడా నిత్యం ఎదో ఓ మరమ్మత్తులు కొనసాగుతుండటం తో వేగంగా వెళ్లే అవకాశం లేదు. ఎంత వేగంగావెళ్లినా పదినుండి ఇరవై,ముప్పై కిలో మీటర్ల వేగం మించే అవకాశంలేదు. ఈ పరిస్థితుల్లో వివిధ అవసరాలకోసం ఏ క్షణంలో బయటకు వెళ్లే అవసరం కల్గు తుందో తెలియని పరిస్థితిలో హెల్మెట్ వెం టతీసుకెళ్లడం సాధ్యం కాదని పట్టణం వర కు హెల్మెట్ లేకుండా తిరిగే వెసలు బాటున సానుబూతితో పరిశీలించాలని ఎంతోకా లంగా సామాన్యుడినుండి అన్ని వర్గాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి.

పట్టణందాటి బయటికి వెలితే ఈ నిబంధన పాటించ డంలో ఎవ్వరికి ఎలాంటి అభ్యంతరం ఉం డ బోదన్నదికూడా అందరి అభిప్రాయం. అయితే వివిధ వర్గాల అభిప్రాయాలను పోలీసులు, ఉన్నతాధికారులు సానుకూలం గా పరిశీలించకుండా బుట్టదాఖలు చేస్తు న్నారు. ఇది ప్రజలపట్ల కరుణ కాకుండా కక్షలా శిక్షలు వేస్తున్నట్లు ఉందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతుంది. ఇదిలా ఉండ గా వివిధ ప్రార్ధనా మందిరాల సమీపంలో పోలీసులు తనఖీలు చేసి హెల్మెట్ లేదం టూ చాలాన్లు రాస్తుండటంతో ప్రార్ధనల కో సం వచ్చే యువత ఇతరులకు ఇబ్బందిగా మారిందని తెల్సింది. ప్రార్ధనలకు వచ్చేందు కు భయపడుతున్నారని ఇది ఎంతో ఇబ్బంది కరంగా ఉందని ఈ విషయంలో కూడా ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న వారి వద్ద కొందరు తమ అభ్యంతరంకూడా వ్య క్తం చేసినట్లు తెల్సింది.