Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) అన్నోజిగూడలో పోలీసుల కార్డన్‌సెర్చ్

అన్నోజిగూడలో పోలీసుల కార్డన్‌సెర్చ్

 Police Cardan search in Annoziguda

మన తెలంగాణ / ఘట్‌కేసర్ : ఘట్‌కేసర్ మండల పరిధిలోని అన్నోజిగూడ గ్రామంలో పోలీసులు  మంగళవారం ఉదయం కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడ గ్రామంలో జరిగిన కార్డన్‌సెర్చ్‌లో మల్కాజ్‌గిరి డీసీపీ ఉమామహేశ్వర్ శర్మ, ఉప్పల్ ఏసీపీ గోనే సందీప్, సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు. సెర్చ్‌లో ఆధారాలు, అనుమతి పత్రాలు లేని ద్విచక్రవాహనాలు 44, కంప్రషర్ ట్రాక్టర్ 1, 6 ఆటోలు, గ్యాస్ సిలిండర్లులు 13, 14 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం అన్నోజిగూడ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఉండటంతో ప్రజలు ఏమి జరుగుతుందోనని ఆందోళనకు గురైనారు. సి.ఐ, ఎస్సైలు, 300 మంది పోలీసుల సిబ్బంది ఇందులో పాల్గొన్నారు.