Home కరీంనగర్ బస్టాండ్‌లో పోలీసులు కార్డన్ సెర్చ్

బస్టాండ్‌లో పోలీసులు కార్డన్ సెర్చ్

Cardon-searchపోలీసుల అదుపులో 18 మంది అనుమానితులు
మన తెలంగాణ/కరీంనగర్ క్రైమ్: కరీంనగర్ ప్రధాన బస్టాండ్ ప్రాంగణంలో పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. జనవరి 26 రిపబ్లిక్ డేను పురస్కరించుకొని నగర డిఎస్‌పి జె.రామారావు ఆధ్వర్యంలో సిఐలు విజయసారధి, సదానందం, మహేష్ లు తనిఖీలు నిర్వహించారు. నగరంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీసులుకు ప్రజలు సహకరించాలని కోరారు. బస్టాండ్‌లో ఎలాంటి గుర్తుంపు కార్డులేని 18 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పండగను జరుపుకొని వివిధ పట్టణాలను వెళ్తున్న వారు ఎక్కువగా ఈ రెండు రోజులపాటు బస్టాండ్‌కు రావడంతో బస్టాండ్ ప్రాంగణం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. రెండు గంటల పాటు ఈ కార్డన్‌సెర్చ్ కొనసాగింది. ట్రైనీ ఐపిఎస్ సింధు శర్మతో పాటు ఎస్‌ఐలు రామకృష్ణ గౌడ్, బొల్లం సత్యనారయణ, సాగర్, రవి, రాజు లతోపాటు పోలీసులు ఈ సెర్చ్‌లో పాల్గొన్నారు.