Friday, March 29, 2024

కరోనా సోకిన విషయాన్ని దాచిన వైద్యురాలు.. కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

 

ముంబయి: కరోనా వైరస్ సోకిన విషయాన్ని దాచి ముంబయి నుంచి గుజరాత్‌కు ప్రయాణించిన 22ఏళ్ల ఓ వైద్యురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మే 4న ముంబయిలో సదరు వైద్యురాలికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయం తెలిసినా కూడా ఆమె మే 5న గుజరాత్‌లోని తన సొంతూరు కుచ్‌కు వెళ్లింది. అక్కడ మూడు రోజులు తిరిగిన తర్వాత మే 8న ఆమె భుజ్ ఆరోగ్య అధికారులను సంప్రదించి..తనకు ముంబయిలో చేసిన కరోనా పరీక్ష నివేధిక వచ్చిందని, ఇందులో కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపింది. దీంతో అధికారులు ఆమెను జికె జనరల్ ఆస్పత్రికి తరలించారు.అయితే, మే 8న తనకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయినట్లు చెప్పిన ఆమె మాటలపై జికె ఆస్పత్రి వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసును సంప్రదించారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కరోనా సోకిన వైద్యురాలి రిపోర్ట్‌ను గుర్తించారు. ఇందులో మే 3న ఆమెకు కరోనా టెస్టు నిర్వహించారని, ఆమె చెప్పినట్లు మే 8న కాకుండా మే 4వ తేదీనే రిపోర్ట్ వచ్చాయని ఉండటంతో ఆమెపై విపత్తు నిర్వహణ చట్టం, 2005కు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Police Case filed against Mumbai doctor hide Covid 19 positive

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News