Home తాజా వార్తలు మూసాపేటలో పోలీసుల నిర్భంద తనిఖీలు

మూసాపేటలో పోలీసుల నిర్భంద తనిఖీలు

CHECKINGహైదరాబాద్ : మూసాపేటలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. మూసాపేటలోని సత్తానగర్‌ను చుట్టుముట్టిన పోలీసులు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు వరకు ఈ తనిఖీలు పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 55 బైక్‌లు, నాలుగు కార్లు, ఏడు ఆటోలు గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు రౌడీషీటర్లతో పాటు ఇద్దరు అనుమానితులు , అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న మరో వ్యక్తి పోలీసులకు దొరికినవారిలో ఉన్నారు.