Thursday, April 25, 2024

జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్

- Advertisement -
- Advertisement -

cordon-search

జగద్గిరిగుట్ట : జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని శివానగర్ సమీపంలో గల వాంబే కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బాలానగర్ జోన్ డిసిపి పి.వి.పద్మాజారెడ్డి, బాలానగర్ ఏసిపి పురుషోత్తం, ఐదుగురు సీఐలు, 18 మంది ఎస్‌ఐలు, మొత్తం 106 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని ఇంటింటికి తిరిగి వివరాలను సేకరించారు. ఈ కార్డన్ సెర్చ్‌లో సరైన ధృవపత్రాలు లేని 55 ద్విచక్రవాహనాలను, 8 ఆటోలను స్వాధీనం చేసుకుని ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట, బాలానగర్, జీడిమెట్ల, సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ల సిఐలు, డిఐ, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Police conduct cordon search in Jagadgiri Gutta

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News