Home తాజా వార్తలు మీర్‌పేట, సైఫాబాద్‌లో కార్డన్ సెర్చ్

మీర్‌పేట, సైఫాబాద్‌లో కార్డన్ సెర్చ్

Police Cordon Search in Meerpet and Saifabad

రంగారెడ్డి: జిల్లాలోని మీర్‌పేట పోలీస్‌స్టేసన్ పరిధిలో పోలీసులు శనివారం సాయంత్రం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. స్థానిక రాజీవ్ గృహకల్ప కాలనీలో 250 మంది పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా 15 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలులేని 20 బైక్‌లు, 4 ఆటోలను సీజ్ చేశారు. 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నగరంలోని సైఫాబాద్ పిఎస్ పరిధిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఖైరతాబాద్ గణేష్ వెనుక ఉన్న గాంధీనగర్‌లో సెంట్రల్ జోన్ డిసిపి విశ్వప్రసాద్ నేతృత్వంలో 200 మంది పోలీసు సిబ్బంది సోదాల్లో జరిపారు.