Wednesday, November 6, 2024

మద్యం మత్తులో సీరియల్ నటుడి వీరంగం

- Advertisement -
- Advertisement -

Police files case against koilamma serial actor amar

రాత్రి ఇంటికి వెళ్లి హంగామా
ఇద్దరు మహిళలపై దౌర్జన్యం
కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు

హైదరాబాద్: మద్యం మత్తులో కోయిలమ్మ సీరియల్ నటుడు హంగామా సృష్టించాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి మణికొండలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… స్వాతి, శ్రీవిద్య స్థానికంగా బొటిక్ నడుపుతున్నారు. ఇందులో స్వాతి, సీరియల్ నటుడు సమీర్ అలియాస్ అమర్ ప్రేమికురాలు. ఇద్దరి మధ్య వచ్చిన గొడవల్లో భాగంగా సమీర్ కల్పించుకున్నాడు. బొటిక్ ఏర్పాటుకు తాను డబ్బులు పెట్టానని శ్రీవిధ్య చెబుతోంది. బుధవారం రాత్రి మద్యం తాగిన సమీర్ రాత్రి 9గంటలకు శ్రీవిద్య, అపర్ణ ఇంటికి వెళ్లి దౌర్జన్యానికి దిగాడు. తమ వద్ద తీసుకున్న డబ్బులు రూ.5లక్షలు తిరిగి ఇవ్వాలని సమీర్ గొడవకు దిగాడు. వెంటనే బాధిత మహిళలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమీర్, స్వాతి నుంచి తమకు ప్రాణభయం ఉందని తమకు రక్షణ కల్పించాలని కోరారు. పోలీసులు బాధితులకు రక్షణ కల్పించి, కేసు నమోదు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News