Tuesday, February 7, 2023

ఎంసెట్ కేసుకు తెర?

  • కొలిక్కిరాని లీకేజీ దర్యాప్తు, చిక్కని సూత్రధారులు, పాత్రధారుల ఆచూకీ
  • 8 మాసాల ప్రయాస వృథా, కేసు మూసి వేయాలని నిర్ణయం?
- Advertisement -

EAMCETహైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎంసెట్-2 ప్రశ్న పత్రం లీకేజీ కేసు దర్యాప్తును ముగించాలని దర్యాప్తు సంస్థ సిఐడి నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికారులు చివరకు చేసేదేమీ లేక ముగిం పు పలకాలని నిర్ణయించారు. ఈ కేసులో ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు దేశంలోని వేర్వేరు రాష్ట్రాలకు చెందిన 81 మందిని అరెస్టు చేశారు. దాదాపు 500 మందిని విచారించారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, కొలకత్తా, చెన్నై తదితర రాష్ట్రాల కు ప్రత్యేక బృందాలు వెళ్ళి దర్యాప్తు జరి పాయి. పేపర్ లీకేజీకి కీలక సూత్రధారు లెవరూ, సహకరించిన పాత్రధారులెవరనే విషయాన్ని తెలుసుకునేందుకు దాదాపు ఎని మిది మాసాలుగా ప్రయత్నిస్తున్నా ఏ మాత్రం ఆధారాలను సేకరించలేక పోయా రు. కోట్లాది రూపాయలు చేతులు మారిన ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించక పోవడంతో మూసి వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఎంసెట్ పేపర్ లీక్ కేసుతో సంబంధం ఉందన్న అభి యోగంపై కొన్నాళ్ళ క్రితం సిఐడి పోలీసులు ఢిల్లీకి చెందిన కమలేష్‌ను అదుపులోకి తీసు కున్నారు. ఇతడిని విచారిస్తున్న సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణించాడు. మృతి చెందిన కమలేష్ ఈ కేసులో కీలక నిందితుడని పేర్కొంటున్న అధికారులు ఇక పై ఆధారాలు దొరకడం కష్టం కాబట్టి కేసు ముందుకు సాగదని అంటున్నారు. ఈ మేర కు త్వరలోనే కోర్టులో చార్జిషీట్‌ను కూడా దాఖలు చేయాలన్ననిర్ణయం తీసుకున్నారు. పేపర్‌ను ఏ ప్రెస్‌లో ముద్రించారు, ఆ ప్రెస్‌లో ఎవరు కమలేష్‌కు సహకరించారన్న అంశాలపై కూడా దృష్టి పెట్టకుండా కమలేష్‌తోనే ఆధారాలన్నీ కోల్పోయామన్న భావనకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. లీకేజీ కేసు వెలుగులోకి వచ్చిన మొదట్లో ప్రభుత్వంలోని పలువురు పెద్దల ప్రమేయం ఉందన్న పుకార్లు జోరుగా షికార్లు చేశాయి. అంతే కాకుండా ఎంసెట్ కన్వీనర్ కార్యాలయం నుంచే పేపర్ ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ సమాచారాన్ని నిందితు లు సేకరించారని, ఆ తర్వాత ప్రెస్‌లోని కొంత మందిని మచ్చిక చేసుకుని పేప ర్‌ను బయటకు తీసుకు వచ్చి విద్యార్థుల తలిదండ్రులను సంప్రదించి లక్షల రూపాయలను తీసుకుని ప్రత్యేక తర్ఫీదు ఇచ్చారన్న విషయాన్ని గుర్తించామని సిఐడి మొదట్లో వెల్లడించింది. కానీ మొత్తం వ్యవహారానికి కారకులెవరూ, కీల కంగా వ్యవహరించింది ఎవరు, అసలు లీకేజీకి బీజం వేసిందెవరనే విషయాన్ని 8 మాసాలు దర్యాప్తు జరిపిన సిఐడి అధికారులు తేల్చలేకపోయారు. నింది తులను గుర్తించడం కోసం సుమారు ఏడు ప్రత్యేక బృందాలను నియమిం చారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ బృందాలు వెళ్ళి దర్యాప్తు జరిపినా దర్యా ప్తును కొలిక్కి రాలేదు. దర్యాప్తులో ఇక ఎలాంటి పురోగతి ఉండబోదని భావిం చిన సిఐడి అధికారులు కేసును మూసి వేస్తున్నామని పేర్కొంటూ కోర్టుకు నివే దిక సమర్పించాలని, త్వరలోనే తుది చార్జీషీట్‌ను దాఖలు చేయాలని నిర్ణయిం చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles