Home Default పోలీసులో హనుమంతుడి లక్షణాలు

పోలీసులో హనుమంతుడి లక్షణాలు

Nakshatram

కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీ చక్ర మీడియా సారథ్యంలో బుట్ట బొమ్మ క్రియేషన్స్ పతాకంపై కె.శ్రీనివాసులు, విన్ విన్ విన్ క్రియేషన్స్ పతాకంపై వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మి స్తున్న చిత్రం ‘నక్షత్రం’. సందీప్ కిషన్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసు కొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మా తలు మాట్లాడుతూ “సెన్సార్ పూర్తిచేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందిన మా చిత్రం సెన్సార్ సభ్యుల ప్రశంసలు కూడా అందు కుంది. పోలీసు అవ్వాలనే ప్రయత్నంలో ఉన్న ఓ యువకుడి కథే ‘నక్షత్రం’. ఈ చిత్రం మా బ్యానర్‌లకు మంచి గుర్తింపును తెస్తుంది”అని అన్నారు. దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ “హనుమంతుడి లక్షణాలన్నీ కూడా పోలీసులో కనిపిస్తాయి. హనుమంతుడిలాగే సేవాభావం, శక్తియుక్తులు పోలీసులో అగుపిస్తాయి. మన రక్షణ కోసం ఉన్న పోలీసు ల్ని చూసి మనం ఎందుకు భయపడుతున్నాం? తప్పు చేస్తే భయపడాలి తప్ప వూరికే ఎందుకు భయపడాలి? అనే విష యాల్ని ఇందులో చర్చించాం. అసలు మామూలు పోలీసు ఎలా ఉంటాడు? వాళ్లతో మనం ఎలా ఉండాలనే ఆలోచన దగ్గరే ఈ కథ మొదలైంది. వాళ్లను మనం చూసే కోణం మారాలని సినిమాలో చెప్పాం”అని అన్నారు. తులసి, జె.డి. చక్రవర్తి, ప్రకాష్ రాజ్, శివా జీరాజా, రఘు బాబు, తనీష్, ముఖ్తర్ ఖాన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రా నికి మాటలుః తోట ప్రసాద్, పద్మశ్రీ, కిరణ్ తటవర్తి, సంగీతంః భీమ్స్, భారత్, పాటలుః అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్, కెమెరాః శ్రీకాం త్ నారోజ్, ఎడిటర్‌ః శివ వై.ప్రసాద్, కొరి యోగ్రఫీః గణేష్, స్వామి, పోరా టాలుః జాషువా మాస్టర్, జాలి బాస్టియన్, శ్రీధర్.