Home తాజా వార్తలు  శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులదే కీలక పాత్ర

 శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులదే కీలక పాత్ర

HOMEహైదరాబాద్ : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులదే కీలక పాత్ర అని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పీపుల్స్ ప్లాజాలో పోలీసు ఎక్స్‌పోను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశం కోసం ఎంతో మంది పోలీసులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందిస్తున్నారని కొనియాడారు. అమరవీరుల త్యాగాలు మరపురానివన్నారు. ఈ ప్రదర్శనలో సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్ సహా పోలీసు విభాగాలకు చెందిన అత్యాధునిక ఆయుధాలు, తుపాకులు, సైబర్ క్రైమ్ పరికరాలు, కేసుల దర్యాప్తు సందర్భంగా ఉపయోగించే పలు రకాల వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. ప్రజలు, కళాశాల, పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై స్టాళ్లను సందర్శించారు.