Home తాజా వార్తలు పోలీసు అమరుల ఆశయాలే లక్ష్యం

పోలీసు అమరుల ఆశయాలే లక్ష్యం

police martyrdom commemoration Day

మనతెలంగాణ/హైదరాబాద్ ః పోలీసు అమరవీరుల త్యాగాలను ఆశయంగా చేసుకుని ముందుకు సాగుతామని రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకోని పోలీసులకు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ క్రమంలో నగరంలోని గోషామహల్‌లో సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంశాఖ మాత్యులు, వివిధ విభాగాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు పాల్గొంటన్నారు. పోలీసుల అమరవీరుల త్యాగాల ఫలంగానే సమాజంలో శాంతి స్థాపన జరిగిందనీ, పోలీసులు అందిస్తున్న సేవలకు ఎలాంటి గుర్తింపు ఆశించకుండా, ప్రజల రక్షణ కోసం తమ విధులు నిర్వర్తిస్తారని డిజిపి తెలిపారు. అనునిత్యం ప్రజాసేవలో విధులు నిర్వర్తిస్తూ.. ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరం వుందనీ, వారి త్యాగాలు వెలకట్టలేనివన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకోని రాష్ట్రవ్యాప్తంగా రక్త దానం, వ్యాసరచన తదితర కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ప్రతీ పోలీస్ విధులు నిర్వహించాలని కోరారు.

police martyrdom commemoration Day